The Rajasab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ అప్డేట్ వచ్చి చాలా రోజులు అవుతోంది. ఆయన ప్రస్తుతం ఫౌజీ, ది రాజాసాబ్ సినిమాలతో మొన్నటి దాకా ఫుల్ బిజీగా గడిపాడు. రెండు వారాల క్రితమే ఇటలీలోని ఓ ఊరికి వెళ్లిపోయాడు. అక్కడ ప్రశాంతంగా సేదదీరుతున్నాడు. ప్రభాస్ ట్రిప్ అయిపోయిందని తెలుస్తోంది. ఈ వారంలోనే అతను ఇండియాకు రాబోతున్నాడంట. వచ్చే వారం నుంచే రాజాసాబ్ డబ్బింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కంటిన్యూగా డబ్బింగ్ పూర్తి చేసి ఫస్ట్ గ్లింప్స్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారంట. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి ఒక్క మోషన్ పోస్టర్ మాత్రమే వచ్చింది. అంతకు మించి ఇంకేమీ బయటకు రాలేదు. షూటింగ్ మాత్రం శరవేగంగా చేశారు.
Read Also : Ricky Ponting: విమానం ఎక్కాక.. మనసు మార్చుకున్న రికీ పాంటింగ్!
షూటింగ్ దాదాపు అయిపోయింది. కాబట్టి ఫ్యాన్స్ కోసం ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారంట. మూవీని త్వరలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ మూవీ గురించి హైప్ ఇవ్వడానికి ఓ గ్లింప్స్ వదలాలని చూస్తున్నారంట. చూస్తుంటే జూన్ రెండో వారంలో గ్లింప్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మూవీని మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రభాస్ ఫస్ట్ టైమ్ హర్రర్ సినిమాలో నటిస్తున్నాడు.
Read Also :NTR: ఎన్టీఆర్ కుమార్తెల చేతుల మీదుగా ‘ఎన్టీఆర్’ లాంఛ్!