Varanasi : వారణాసి ఈవెంట్ లో హనుమంతుడిపై చేసిన కామెంట్ల వల్ల రాజమౌళి ఎంత పెద్ద వివాదంలో చిక్కుకున్నాడో మనకు తెలిసిందే. ఇప్పటికే ఆయనపై వరుసగా కేసులు పెడుతున్నారు. హిందూ సంఘాలు, బిజెపి నేతలు, హనుమంతుడి భక్తులు తీవ్రస్థాయిలో రాజమౌళి పై ఫైర్ అవుతున్నారు. రాజమౌళి సినిమాలను హిందువులు బ్యాన్ చేయాలంటూ నినాదాలు కూడా వస్తున్నాయి. రాజమౌళి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్స్ వస్తున్న వేళ.. జక్కన్న ఓ షాకింగ్ వీడియో రిలీజ్ చేశాడు. వారణాసి ఈవెంట్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నాడు రాజమౌళి.
Read Also : Mythri Movie Makers : “చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్” ను తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రీ మూవీస్
ఈవెంట్ కోసం ఎలా ప్లాన్ చేశారో, జక్కన్న ఎంతగా కష్టపడ్డాడో ఇందులో కనిపిస్తోంది. అలాగే మహేష్ బాబు ఎద్దు బొమ్మ మీద వచ్చే ఎంట్రీ సీన్ కూడా ఎంతగా ప్రాక్టీస్ చేశాడో మనం చూడొచ్చు. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. ఒకరకంగా రాజమౌళి తాను ఈవెంట్ కోసం ఎంత కష్టపడ్డాడో తెలియజేసేందుకే ఈ వీడియోను రిలీజ్ చేశాడా అనే అనుమానాలు వస్తున్నాయి. తాను అంత కష్టపడ్డాను కాబట్టే అంత పెద్ద స్క్రీన్ మీద గ్లింప్స్ వీడియో ప్లే కాకపోవటం వల్ల అలా అసంతృప్తికి గురైనట్టు చెప్పకనే చెప్పాడా అని కామెంట్లు వస్తున్నాయి. మొత్తానికి రాజమౌళి క్షమాపణలు చెప్పకుండా ఇలాంటి వీడియో రిలీజ్ చేశాడు అంటేనే.. వివాదం మీద స్పందించేందుకు రెడీగా లేడని అర్థం అయిపోయింది.
Read Also : Mahavatar Narsimha : ఆస్కార్ రేసులో మహావతార్ నరసింహా..!