Mythri Movie Makers : మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే తెలుగులో తీసుకొస్తుందనే విషయం తెలిసిందే. తాజాగా మలయాళ WWE-జానర్ యాక్షన్ కామెడీ “చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్” ను తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతోంది. జనవరి 2026లో విడుదల కానున్న ఈ సినిమాను కేరళలో దుల్కర్ సల్మాన్ నేతృత్వంలోని వేఫేరర్ ఫిల్మ్స్ రిలీజ్ చేయనుంది. కొత్త దర్శకుడు అద్వైత్ నాయర్ తెరకెక్కించిన ఈ మూవీని రీల్ వరల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ నిర్మాణ సంస్థను ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లెన్స్‌మన్ గ్రూప్ కలిసి ఏర్పాటు చేశాయి. అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, ఇషాన్ షౌక్కత్ (“మార్కో” ఫేమ్), విశాఖ్ నాయర్, పూజా మోహన్‌దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Read Also : Bigg Boss 9 : బిగ్ బాస్ లోకి మళ్లీ గౌతమ్.. ఏంటీ ట్విస్టులు
WWE రెజ్లింగ్ స్ఫూర్తిగా ఈ మూవీని తీశారు. ఈ మూవీ టీజర్ ఇప్పటికే రిలీజ్ అయి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఫోర్ట్ కొచ్చిలోని WWE-జానర్ రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో తీసిన ఈ మూవీ ప్రేక్షకులకు గొప్ప యాక్షన్-కామెడీ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని అంటున్నారు మేకర్స్. ఇప్పటికే వస్తున్న మూవీ పోస్టర్లు, సాంగ్స్ అంచనాలను పెంచుతున్నాయి. ఈమూవీని పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేసస్తున్నారు. హిందీలో ధర్మ ప్రొడక్షన్స్, PVR ఐనాక్స్ పిక్చర్స్ తమిళనాడు, కర్ణాటకలో రిలీజ్ చేస్తుంది. 115 కంటే ఎక్కువ దేశాలలో విడుదల అవుతోంది. బాలీవుడ్ త్రయం శంకర్-ఎహ్సాన్-లాయ్ మ్యూజిక్ అందించారు.
Read Also : Mahavatar Narsimha : ఆస్కార్ రేసులో మహావతార్ నరసింహా..!