Raj Kundra : బాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ జంట అంటే రాజ్ కుంద్రా, హీరోయిన్ శిల్పాశెట్టి అనే చెప్పాలి. రాజ్ కుంద్రా బిజినెస్ పర్సన్ గా చాలా ఫేమస్. శిల్పాశెట్టి బాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్ గా ఉండేది. ఈ జంట ఏదో ఒక కాంట్రవర్సీతో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటారు. గతంలో ఓ పెద్ద కేసులో ఇరుక్కున్న వీరు… ఆ తర్వాత బయటకు వచ్చారు. తాజాగా స్వామీజీ ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమానికి ఈ జంట వెళ్లింది. అక్కడ ప్రేమానంద్ తో వీరు మాట్లాడారు.
Read Also : Krithi Sanon : ప్రభాస్ హీరోయిన్ లగ్జరీ ఫ్లాట్.. ఎన్ని కోట్లంటే..?
ఈ సందర్భంగా రాజ్ కుంద్రా ఎవ్వరూ ఊహించిన కామెంట్స్ చేశారు. ‘నేను మీ వీడియోలు రెగ్యులర్ గా చూస్తాను. నాకు ఉన్న డౌట్లు, భయాలకు మీ వీడియోల ద్వారా ఆన్సర్ వెతుక్కుంటాను. మీ వల్ల నాకు ఎలాంటి సమస్యలు లేవు. మీ హెల్త్ ప్రాబ్లమ్ గురించి నాకు తెలుసు. మీకు నా రెండు కిడ్నీల్లో ఒకటి ఇస్తాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దానికి ప్రేమానంద్ స్వామీజీ థాంక్స్ చెప్పాడు. అయితే ప్రేమానంద్ కు రెండు కిడ్నీలు చెడిపోయినట్టు తెలుస్తోంది. ఈ వ్యాధితో ఆయన కొన్నేళ్లుగా బాధపడుతున్నాడు. అందుకే రాజ్ కుంద్రా ఇలాంటి కామెంట్స్ చేశాడేమో అనుకుంటున్నారు.
Read Also : Mrunal Thakur : తెలివి తక్కువగా మాట్లాడా.. మృణాల్ క్షమాపణలు