Radhika Sharathkumar: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సినిమాల్లోనే కాదు బయట కూడా ఆమె రెబల్. ఏది మాట్లాడినా నిర్మొహమాటంగా ముఖం మీదే చెప్పుకొచ్చేస్తోంది. ఇక తాజాగా రాధికా, బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో లో సందడి చేసిన విషయం విదితమే. ఈ షోలో స్టార్ల గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారింది. షోకు వచ్చినవారిని ఆదుకోకుండా బాలయ్య పంపించింది లేదు. ఇక రాధికను కూడా తన ప్రశ్నలతో ఆడేసుకున్నాడు.
“రజినీకాంత్ తో నువ్వు నటించావు కదా.. అతనిలో నీకు నచ్చనిది ఏంటి?” అన్న ప్రశ్నకు.. రాధికా మాట్లాడుతూ..” అతనొక పెద్ద బోరింగ్ పర్సన్.. ఎవరితో ఎక్కువ మాట్లాడడు.. తన పని అయిపోయిన తర్వాత ఓ మూలన కూర్చుంటాడు” అని చెప్పుకొచ్చింది. దీంతో అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు. సూపర్ స్టార్ ను పట్టుకొని అంత మాట అనేసిందేటి అని నోళ్లు నొక్కుకున్నారు. అయితే రాధికా చెప్పినదాంట్లో తప్పేం లేదని తెలుస్తోంది. ఆమె సరదాగా ఆయనతో ఉన్న చనువును బట్టి ఆ టోన్ లో అన్నా రజినీ తన పని తాను చేసుకొనే టైప్ అని అందరికి తెల్సిందే. సెట్ లో సైతం తన షాట్ అవ్వగానే తన కుర్చీలో కూర్చొని పుస్తకాలు చదువుకోవడమో, ధ్యానం చేయడమో చేస్తూ ఉంటారట. ప్రస్తుతం రాధిక మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.