ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది బొద్దు భామ రాశీ ఖన్నా.. ఈ చిత్రం తర్వాత అమ్మడికి మంచి అవకాశాలే వచ్చాయి కానీ విజయాలు మాత్రం అమ్మడి దారికి చేరలేదు. కుర్ర హీరోలు, స్టార్ హీరోలందరితోను రాశీ నటించి మెప్పించింది. అయినా లక్ మాత్రం కలిసిరాలేదు. ఇక టాలీవుడ్ ను నమ్ముకుంటే ప్రయోజనం లేదని కోలీవుడ్ కి వెళ్ళింది. అక్కడా పేరు ఉన్న హీరోలతో నటించింది. అయినా ముద్దుగుమ్మకు విజయం మాత్రం దక్కలేదు. ఇక ఈసారి బాలీవుడ్ లో పాగా వేద్దామని జీరో సైజ్ కి వచ్చి అజయ్ దేవగణ్ సరసన రుద్ర అనే వెబ్ సిరీస్ చేసింది. ప్రస్తుతం ఈ సిరీస్ మంచి పాజిటివ్ టాక్ ని అందుకొని రాశీకి మంచి ప్రశంసలు తెచ్చిపెడుతుంది. దీంతో అమ్మడికి హిందీలో అవకాశాలు బాగానే వస్తున్నాయి.
ఇక ఏరు దాటాకా తెప్ప తగలేసినట్లు.. హిందీలో అవకాశాలు రావడంతో ఈ ఢిల్లీ భామ సౌత్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ” సౌత్ సినిమాల్లోకి అడుగుపెట్టాకా రొటీన్ ఫార్ములాకు అలవాటు పడ్డాను.. నాకు రొటీన్ గా ఉండడం ఇష్టం ఉండదు.. కమర్షియల్ సినిమాలలో హీరోల పక్కన కొద్దిసేపు కనిపించడం, తర్వాత పక్కకు వెళ్లిపోవడం ఇదే రొటీన్ ఫార్ములాను టాలీవుడ్ క్రియేట్ చేసింది. అందులో నేను కూడా పడిపోయాను. ఇక నుంచి నా కథల ఎంపికలో కొత్తదనం ఉంటుంది.. ప్రతి సినిమాలో ఒక కొత్త నన్ను చూస్తారు.
ఇక సౌత్ లో ఉన్న ఇంకొక విషయం ఏంటంటే.. ప్రతిభను బట్టి కాకూండా లుక్స్ ని బట్టి గుర్తింపు ఇస్తారు.. ఇక అభిమానులు అయితే ఒక్కో హీరోయిన్ కి ఒక్కో ట్యాగ్ ఇస్తారు.. అది నాకు అస్సలు నచ్చదు.. కొద్దిగా తెల్లగా ఉంటె వారిని మిల్కీ బ్యూటీ అనేస్తారు.. ఇప్పటికైనా టాలెంట్ ని బట్టి హీరోయిన్లను గుర్తించాలని అభిమానులను కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. బాలీవుడ్ కి వెళ్లేసరికి టాలీవుడ్ నే ఎత్తి చూపిస్తున్నావా అంటూ నెటిజన్స్ అమ్మడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.