Raashi Khanna:ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైంది రాశీ ఖన్నా. ముద్దుగా బొద్దుగా కుర్రాళ్ళ గుండెలను గిచ్చేసింది. ఈ సినిమా తరువాత అమ్మడికి మంచి ఛాన్సులే వచ్చాయి కానీ.. విజయాలు మాత్రం రాలేదు. టాలీవుడ్, కోలీవుడ్ అంటూతిరుగుతూ వచ్చిన సినిమా అవకాశాన్ని చేజార్చుకోకుండా ట్రై చేస్తూనే వచ్చింది. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక చివరికి బాలీవుడ్ ను కూడా టార్గెట్ చేసింది. రుద్ర అనే వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ఫర్జీ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది. ఇక ఈ సిరీస్ అమ్మడికి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. అటు బాలీవుడ్ ను ఇటు టాలీవుడ్ ను షేక్ చేసింది.
Mrunal Thakur: అప్పుడే అంత రేటు పెంచేస్తే ఎలా బ్యూటీ..?
ఇక ఈ సిరీస్ హిట్ తో ముద్దుగుమ్మకు మంచి అవకాశాలే వస్తున్నాయి అన్నది ఇండస్ట్రీలో టాక్. ఫర్జీ సెకండ్ సీజన్ లో రాశీ నటిస్తోంది. ఇది కాకుండా మరో రెండు ప్రాజెక్ట్స్ ను అమ్మడు ఓకే చేసిందట. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. బొద్దుగానుంచి బక్కగా అయ్యాకా రాశీ అందాల ఆరబోతను కాస్తా ఎక్కువే ఆరబోస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ కుర్రకారును షేక్ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వైట్ అండ్ వైట్ లో మెరిసిపోయింది. ఇక లేడీ బాస్ లుక్ లో అదరగొట్టేసింది. అయితే లోపల బ్రా కూడా లేకుండా ఎద అందాలను ఆరబోసేసింది. ఇలాంటి ఫోటోషూట్స్ రాశీకి కొత్తేమి కాదు. అంతకుముందు కూడా ఇలాంటి ఫోటోషూట్ చేసింది. అయితే ఈసారి మాత్రం హిట్ అందుకున్నాకా ఇలాంటి బోల్డ్ లుక్ లో దర్శనమిచ్చింది. దీంతో ఒక్క హిట్ వచ్చిందో లేదో.. విప్పి చూపించడం ఎక్కువైందిగా అంటూ అభిమానులు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.