Raashi Khanna:ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైంది రాశీ ఖన్నా. ముద్దుగా బొద్దుగా కుర్రాళ్ళ గుండెలను గిచ్చేసింది. ఈ సినిమా తరువాత అమ్మడికి మంచి ఛాన్సులే వచ్చాయి కానీ.. విజయాలు మాత్రం రాలేదు. టాలీవుడ్, కోలీవుడ్ అంటూతిరుగుతూ వచ్చిన సినిమా అవకాశాన్ని చేజార్చుకోకుండా ట్రై చేస్తూనే వచ్చింది.