Pushpa 2 The Rule sticks on Release Date: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సెకండ్ పార్ట్ మీద దాదాపు అందరిలో ఆసక్తి నెలకొంది. నిజానికి పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద అందరికీ అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు ఈ మధ్యకాలంలో సౌత్ సినిమాలు నార్త్ లో బీభత్సమైన హిట్లు కొట్టడమే కాదు భారీ వసూళ్లు కూడా నమోదు చేస్తూ ఉండడంతో రెండో భాగం మీద సుకుమార్ చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతుందని అందుకే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని ఆ మధ్య ప్రచారం మొదలైంది.
Padma Vibhushan: చిరంజీవి కన్నా ముందు పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న తారలు వీరే..
నిజానికి ముందుగా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ఏప్రిల్ ఐదో తేదీ రిలీజ్ కావడం లేదని ఆ సినిమా ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న క్రమంలో అల్లు అర్జున్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు అని కూడా ప్రచారం జరిగింది. అదేమిటంటే తాను రిలీజ్ చేయాలనుకుంటున్న ఆగస్టు 15వ తేదీ త్యాగం చేసి ఆయన వెనక్కి వెళ్ళాడని పుష్ప మొదటి భాగం విడుదల చేసినట్లుగానే రెండో భాగాన్ని కూడా డిసెంబర్ చివరి వారంలో రిలీజ్ చేసి హిట్టు కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడని ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయాన్ని సినిమా యూనిట్ గా ఖండించింది. తాను ముందుగా చెప్పినట్లు ఆగస్టు 15వ తేదీన కచ్చితంగా వచ్చేస్తున్నామని పుష్పా గాడు ఆ రోజు దిగడం ఖాయం అని అంటూ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది.