Donald Trump: ఎన్విడియా సీఈఓగా హువాంగ్ రీఎంట్రీ.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- ఎన్విడియా సీఈఓగా తిరిగి జెన్సన్ హువాంగ్ నియామకం..
- హర్షం వ్యక్తం చేసిన ట్రంప్, ఆయన దేశభక్తుడంటూ ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ను తిరిగి సీఈఓగా నియమించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. బోర్డు తీసుకున్న నిర్ణయం సరైనదని, అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు ఎన్విడియా విజయానికి హువాంగ్ నాయకత్వం అవసరమని అన్నారు. ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టడం వల్ల అమెరికా జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అటార్నీ జనరల్ కూడా హువాంగ్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినట్లు తమ వద్ద ఆధారాలు లేవని ధృవీకరించినట్లు ఆయన ప్రస్తావించారు. జెన్సన్ తిరిగి సీఈఓగా నియమించాలనే బోర్డు నిర్ణయం సరైందని, హువాంగ్ గొప్ప దేశభక్తుడని, జాతీయ సంపద అని ట్రంప్ అభివర్ణించారు.
దీనికి ముందు, జెన్సన్ హువాంగ్‌కు సీఈఓ బాధ్యతలు కట్టబెట్టాలని ఎన్విడియా బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. తాజాగా అమెరికా ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి అధికారుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత హువాంగ్ పునర్నియామకంపై నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. 1993లో ఎన్విడియాను సహ స్థాపించిన జెన్సన్ హువాంగ్ మూడు దశాబ్దాలకు పైగా కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు. అలిస్ హువాంగ్ అనే మహిళతో సంబంధం, ఆమె చైనాకు ఎన్విడియా చిప్‌లను అక్రమంగా తరలించిందనే ఆరోపణల నేపథ్యంలో ఆయన నవంబర్ 12న రాజీనామా చేశారు. తిరిగి 11 రోజులకే మళ్లీ సీఈఓగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
Also Read
- Jensen Huang: ఎన్విడియా సీఈఓగా తిరిగి జెన్సన్ హువాంగ్ నియామకం..
- China-Bangladesh: చైనా నుంచి బంగ్లాదేశ్‌కు క్షిపణి ఇంధన రసాయనం? పట్టుకున్న ఇండోనేషియా నేవీ!
- India-Modi: ఆసియా టాప్-3లో భారత్.. అత్యంత సమర్థవంతమైన నేతల్లో రెండో స్థానంలో మోదీ!
- Houthis Attack Saudi Arabia: సౌదీ అరేబియాపై హూతీల దాడి.. చమురు శుద్ధి కర్మాగారమే టార్గెట్..!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Donald Trump: ఎన్విడియా సీఈఓగా హువాంగ్ రీఎంట్రీ.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
-
Family Pack Teaser : “గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు!”:
-
Jensen Huang: ఎన్విడియా సీఈఓగా తిరిగి జెన్సన్ హువాంగ్ నియామకం..
-
UP Crime: అక్క భర్తతో ప్రేమాయణం.. పెళ్లికి అడ్డుగా ఉందని తల్లిని చంపేసింది!
-
NIMS : నిమ్స్‌లో ఏసీబీ షాకింగ్ తనిఖీలు.. చనిపోయిన రోగుల పేరుతోనూ బిల్లులు!
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!