Devara: ‘దేవర’ శాటిలైట్ రైట్స్ సస్పెన్స్‌కు తెర.. బడా ఛానెల్స్‌కు షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లలో వందల కోట్ల వసూళ్లు రాబట్టడమే కాకుండా, ఓటీటీలోనూ ఈ సినిమా రికార్డు స్థాయి వ్యూయర్షిప్ అందుకుంది. అయితే, సినిమా రిలీజ్ అయి ఇంతకాలం గడుస్తున్నా తెలుగులో మాత్రం ఈ చిత్రం ఇప్పటివరకు బుల్లితెరపై ప్రసారం కాకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒక స్టార్ హీరో బ్లాక్‌బస్టర్ సినిమా శాటిలైట్ హక్కులు ఇన్నాళ్లు హోల్డ్‌లో ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎట్టకేలకు ఆ సస్పెన్స్‌కు ఇప్పుడు తెరపడినట్లు ఫిల్మ్ నగర్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్‌లోని దిగ్గజ ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లు ‘దేవర’ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయనే ప్రచారం జరిగినా, అనూహ్యంగా కొత్త ప్లేయర్ రంగంలోకి దిగి అందరికీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే తెలుగు బుల్లితెరపై అడుగుపెట్టబోతున్న ‘సోనీ తెలుగు’ (Sony Telugu) ఛానెల్ ఈ భారీ చిత్రం శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
నిజానికి, కొత్తగా ప్రారంభం కాబోతున్న ఒక ఎంటర్టైన్మెంట్ ఛానెల్ నేరుగా ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరో సినిమాతో లాంచ్ అవ్వాలని ప్లాన్ చేయడం టెలివిజన్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు తెలుగు శాటిలైట్ మార్కెట్‌ను శాసిస్తున్న పాత ఛానెళ్లకు గట్టి పోటీ ఇచ్చేందుకే సోనీ యాజమాన్యం ఈ రేంజ్ డీల్ కుదుర్చుకున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటీటీ స్ట్రీమింగ్ నిబంధనల కారణంగా ఆలస్యమైన ‘దేవర’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కోసం తారక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు కొత్త ఛానెల్లోకి ఈ సినిమా రాబోతుండటంతో, ప్రారంభోత్సవ వేళ టీఆర్పీ రేటింగ్స్‌లో ఎలాంటి రికార్డులు నమోదవుతాయో చూడాలి. త్వరలోనే ఈ డీల్‌పై, ఛానెల్ లాంచ్ డేట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Also Read
- Bhogi Trailer: భోగి ట్రైలర్లో కథ చెప్పేశారుగా? ఆ మర్డర్స్ వెనక కుట్ర?
- Sharwanand-Bhogi: ఒత్తిడి, భయం లేవు.. ‘భోగి’తో హిట్ కొడతా!
- Ajith-MS Dhoni: ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు 'తలా'లు.. మధ్యలో సూపర్ స్టార్.. పిక్స్ అదిరిపోలా!
- Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
తాజావార్తలు
-
Devara: ‘దేవర’ శాటిలైట్ రైట్స్ సస్పెన్స్‌కు తెర.. బడా ఛానెల్స్‌కు షాక్
-
Krishna Water Dispute: కృష్ణా జలాలపై మళ్లీ రగడ.. ఏపీకి తెలంగాణ స్ట్రాంగ్ కౌంటర్
-
Telangana Global Summit: గ్లోబల్ సమ్మిట్‌పై రేవంత్ స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు.!
-
Uttar Pradesh: పెళ్లిలో కోటి రూపాయల నోట్ల దండలు.. ఇద్దరు వరులకు బావ అదిరిపోయే గిఫ్ట్!
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!