SKN: మెగా అభిమాని ఎస్కేఎన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్విట్టర్ లో మెగా హీరోలను ఏదైనా అంటే వాళ్ళను ఏకిపారేస్తూ ట్వీట్ చేయడంతో ఎస్కేఎన్ జీవితం మారిపోయింది. ఆ ట్వీట్స్ కు మెచ్చిన బన్నీ అతనిని హైదరాబాద్ రమ్మనడం.. అక్కడ నుంచి ఒక జర్నలిస్ట్ గా.. ఒక పిఆర్వో గా.. ఒక నిర్మాతగా ఎదిగాడు ఎస్కేఎన్. బేబీ సినిమాను నిర్మించడం.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం ఒక ఎత్తు అయితే.. ఆ సినిమాను అల్లు అర్జున్, అల్లు అరవింద్ లాంటివారు పొగడడం మరొక ఎత్తు. ఇక ఇక్కడితో ఇది ఆగుతుంది అనుకున్నారు కానీ, ఈ సినిమాను మెగాస్టార్ ప్రశంసించడం అనేది ఎస్కేఎన్ జీవితంలోనే ఒక పెద్ద మైలురాయి అని చెప్పుకోవచ్చు. తాజాగా బేబీ మూవీ మెగా సెలబ్రేషన్స్ కు చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎస్కేఎన్ తన అభిమాన హీరో గురించి మనసులోని మాటలను చెప్పుకొచ్చాడు.
Dil Raju: బిగ్ బ్రేకింగ్.. ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా దిల్ రాజు ఘన విజయం
నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ.. “మంచితనం ఒక శిఖరం అయితే మెగాస్టార్ ఎవరెస్ట్ లాంటి వారు. ఆయనను కామెంట్ చేసిన వారిని కూడా దగ్గరకు తీసే స్వభావం చిరంజీవి గారిది. ఆయన చేసే సేవా కార్యక్రమం బ్లడ్ బ్యాంక్ గురించి కామెంట్ చేశారు. వాళ్లకు ఈ మధ్యే జైలు శిక్ష పడింది. సోషల్ మీడియా వచ్చాక మా ఫ్యాన్స్ అంతా ఎడ్యుకేట్ అయి..విమర్శల్ని ఎలా తిప్పి కొట్టాలో నేర్చుకున్నాం. నిజం చెబుతున్నాం. ఆంజనేయుడికి ఆయన బలం తెలియనట్లే..చిరంజీవి గారికి ఆయన శక్తి, ఆయన అభిమానుల శక్తి తెలియదు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు, స్టార్స్ అంటున్నాం గానీ చిరంజీవి గారు ఎప్పుడో గ్లోబల్ స్టార్. అంటార్కిటికాలోనూ ఆయనకు అభిమానులు ఉంటారు. వయసు మెగాస్టార్ విషయంలో ఒక నెంబర్ మాత్రమే. భోళా శంకర్ లో ఆయన వేస్తున్న స్టెప్పులు చూస్తుంటే సర్ ప్రైజింగ్ గా ఉంది. అందుకే ఎవరైనా తప్పుగా మాట్లాడితే బాస్ రా బచ్చా అని చెబుతుంటా. చిరంజీవి ఫ్యాన్స్ అంటే బ్యానర్స్ కట్టేవాళ్లమే కాదు బ్యానర్స్ పెట్టేవాళ్లమని గర్వంగా చెబుతున్నా. నాకు వచ్చిన సక్సెస్ క్రెడిట్ అంతా చిరంజీవి గారిదే. మీరు లేకుంటే ఒక సాయి రాజేష్, మారుతి, నేను..నాలాంటి వారు లేరు. విజయ్ తో టాక్సీవాలా, ఆనంద్ తో బేబీ చేశాను. వర్ధన్ గారు ఇందాక నన్ను ఎస్కేఎన్ దేవరకొండ అని పిలుస్తున్నారు. మీ ఇద్దరితో సినిమాలు ప్రొడ్యూస్ చేయడం హ్యాపీగా ఉంది” అని చెప్పుకొచ్చాడు.