Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీ బాగుకోరుకొనేవారిలో మొదటి స్థానంలో ఉంటారు. తన, మన అనే బేధం లేకుండా అందరిని తన సొంత బిడ్డలుగానే చూస్తారు. ఇక సినిమాల విషయంలో అయితే.. సినిమా నచ్చితే.. నిర్మొహమాటంగా ఆ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ఉంటారు. తాజాగా బేబీ సినిమాను చిరు ప్రశంసించారు.
SKN: మెగా అభిమాని ఎస్కేఎన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్విట్టర్ లో మెగా హీరోలను ఏదైనా అంటే వాళ్ళను ఏకిపారేస్తూ ట్వీట్ చేయడంతో ఎస్కేఎన్ జీవితం మారిపోయింది. ఆ ట్వీట్స్ కు మెచ్చిన బన్నీ అతనిని హైదరాబాద్ రమ్మనడం.. అక్కడ నుంచి ఒక జర్నలిస్ట్ గా.. ఒక పిఆర్వో గా.. ఒక నిర్మాతగా ఎదిగాడు ఎస్కేఎన్.
Sai Rajesh: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వం వహించిన చిత్రం బేబీ. ఎస్ కేఎన్ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 14 న నెల రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు రికార్డు కలెక్షన్స్ ను రాబట్టి ఆశ్చర్యపరిచింది.