SSMB 29 : రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో వస్తున్న గ్లోబ్ ట్రాటర్ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈవెంట్ నిర్వహించకముందే రాజమౌళి వరుస అప్డేట్లు ఇస్తున్నాడు. మొన్న పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ రిలీజ్ చేశాడు. దాని తర్వాత శృతిహాసన్ సాంగ్.. ఈరోజు ప్రియాంక చోప్రా లుక్ రిలీజ్ చేశాడు. అయితే ప్రియాంక చోప్రా లుక్ అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ఎందుకంటే ఆమెది నెగెటివ్ పాత్రనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రియాంక హీరోయిన్ అని ముందు నుంచి అంతా అనుకున్నారు.
Read Also : SSMB 29 : చడీచప్పుడు లేకుండా పోస్టర్లు.. రాజమౌళి ఏం చేస్తున్నావ్..?
కానీ తాజా లుక్ లో ఆమె పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. చీరకట్టులోనే గన్ పట్టుకుని కనిపించింది. దీన్ని బట్టి చూస్తే ఆమె పాత్ర నార్మల్ హీరోయిన్ గా కాకుండా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. రాజమౌళి సినిమాల్లో హీరోయిన్లకు కూడా మంచి పాత్రలు పడుతాయి. ఇప్పుడు ప్రియాంక చోప్రాకు కూడా పవర్ ఫుల్ విలన్ పాత్ర లాంటిది ఏదైనా ప్లాన్ చేశాడేమో అంటున్నారు. ఎందుకంటే ఆమె పాత్రలో వేరియేషన్స్ ఉంటాయని రాజమౌళి స్వయంగా చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే మందాకిని కొన్ని సీన్లలో మంచిగా కనిపించినా.. యాక్షన్ సీన్లలో అదరగొట్టే విలన్ పాత్రలో కనిపిస్తుందని సమాచారం. ఆమె ముందు మంచిగా కనిపించినా.. ఆమె పాత్రలో ట్విస్టులు తర్వాత బయటపడుతాయని అంటున్నారు.
Read Also : Kajol : పెళ్లికి ఎక్స్ పైరీ డేట్ కావాలంట.. ఈ హీరోయిన్ కు ఏమైంది..