Kajol : ఈ మధ్య ఓ సీనియర్ హీరోయిన్ మరీ దారుణంగా మాట్లాడుతోంది. ఎంత హోస్ట్ గా చేస్తే మాత్రం.. మరీ దారుణంగా మాట్లాడటం ఏంటని మండిపడుతున్నారు నెటిజన్లు. ఆమె ఎవరో కాదు కాజోల్. మనకు తెలిసిందే కదా.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు కాజోల్, ట్వింకిల్ ఖన్నా కలిసి ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే ప్రోగ్రామ్ చేస్తున్నారు. తాజాగా దీనికి విక్కీ కౌశల్, కృతిసనన్ వచ్చారు. ఇందులో పెళ్లి గురించి టాపిక్ వచ్చినప్పుడు కాజలో మాట్లాడుతూ.. పెళ్లికి కూడా ఎక్స్ పైర్ డేట్ ఉంటే బాగుండు అని చెప్పింది.
Read Also : Mowgli : మోగ్లీ టీజర్ రిలీజ్.. అదిరిన విజువల్స్
ఆమె మాటలకు అంతా షాక్ అయ్యారు. అది పెళ్లి.. వాషింగ్ మెషీన్ కాదు అంటూ తెలిపింది. పెళ్లి చేసుకున్నాక పర్ ఫెక్ట్ పర్సన్ దొరకలేదు అనే ఫీలింగ్ కలిగితే రెన్యువల్ చేసుకునే ఆప్షన్ ఉంటే బాగుంటుంది అని కాజోల్ చెప్పడం నిజంగానే విడ్డూరంగా ఉంది. ఈ కాజోల్ మొన్న కూడా జాన్వీకపూర్ వచ్చినప్పుడు.. పెళ్లి చేసుకోకపోయినా సరే నచ్చిన వ్యక్తితో శృంగారం చేస్తే తప్పులేదు అనే స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇలా వరుస స్టేట్ మెంట్స్ ఇస్తూ నెటిజన్లతో తిట్లు తింటోంది. అయినా సరే ఆమె ఇలాంటి బోల్డ్ కామెంట్స్ ఆపట్లేదు.
Read Also : Prakash Raj : ఆ విషయం తెలియకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశా..