Priyanka Chopra : అప్పట్లో ప్రియాంక చొప్రా కొన్ని కామెంట్స్ చేసిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ‘వర్జినిటీ ఉన్న అమ్మాయిని కాదు.. మంచి గుణాలు ఉన్న అమ్మాయిని చేసుకోండి. వర్జినిటీ ఒక్క రాత్రితో పోతుంది. కానీ క్యారెక్టర్, సంస్కారం ఎప్పటికీ ఉండిపోతాయి’ అనే కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ కామెంట్స్ ప్రియాంక చోప్రా చేసిందంటూ పోస్టులు, ట్రోల్స్, మీమ్స్ కనిపించాయి. ఈ కామెంట్స్ పై తాజాగా ప్రియాంక స్పందించింది.
Read Also : Vijay Varma : విజయ్ వర్మతో డేటింగ్ పై దంగల్ బ్యూటీ క్లారిటీ..
‘ఇప్పుడున్న ఆన్ లైన్ యుగంలో ఇలాంటి ఫేక్ పోస్టులు కామన్ అయిపోయాయి. నేను ఆ కామెంట్స్ చేయలేదు. వాటితో నాకు సంబంధం లేదు. అబ్బాయిలు ఎలాంటి అమ్మాయిలను చేసుకోవాలనేది నేను ఎప్పుడూ చెప్పలేదు. నా పేరు మీద ఇలాంటి ఫేక్ పోస్టులు ఇదేం కొత్త కాదు. గతంలోనూ చాలా ఫేక్ పోస్టులు వేశారు.
ఫేమస్ అవ్వడం కోసం, వైరల్ కావడం కోసం ఇలాంటి రూమర్లు క్రియేట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. నేను అబ్బాయిలను కించపరిచేలా మాట్లాడలేదు. ఎప్పుడూ అందరూ సమానం అనే చెబుతుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది. కానీ ఆ ప్రచారం దేశమంతా జరిగిపోయిన తర్వాత లేటుగా స్పందించడం వల్ల ఉపయోగం లేదేమో అంటున్నారు నెటిజన్లు.
Read Also : Kannappa: ‘కన్నప్ప’కి మంచు మనోజ్ విషెస్.. మంచు విష్ణుని మాత్రం?