Vijay Varma : తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ కొత్త గర్ల్ ఫ్రెండ్ ను పట్టాడంటూ పెద్ద ప్రచారం జరుగుతోంది. దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన ఫాతిమా సనాషేక్ తో అతను డేటింగ్ లో ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై తాజాగా ఆమె స్పందించారు. ఆర్.మాధవన్, ఫాతిమా సనాషేక్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆప్ జైసా కోయి’. మూవీ జులై 11న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చేసిన ప్రమోషన్లలో ఆమె పాల్గొంది. ఇందులో ప్రేమ, పెళ్లిపై స్పందించింది.
Read Also : YS Jagan: ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో సీఎం చంద్రబాబు చెప్పాలి!
మీరు ఎవరితో అయినా ప్రేమలో ఉన్నారా అని రిపోర్టర్ ప్రశ్నించగా ఆమె క్లారిటీ ఇచ్చింది. ‘నేను ఎవరితోనూ రిలేషన్ లో లేను. నేను ఇంకా పర్ ఫెక్ట్ భాగస్వామిని ఎంచుకోలేదు. అలాంటి వ్యక్తి నా జీవితంలోకి వచ్చినప్పుడు ఆ విషయం నేనే చెబుతాను’ అంటూ రిప్లై ఇచ్చింది. దీన్ని బట్టి ఆమె విజయ్ వర్మతో డేటింగ్ లో లేదని తేలిపోయింది.
కానీ ఈ నడుమ విజయ్ తో ఆమె తరచూ బయట కనిపిస్తోంది. అందుకే ఈ వార్తలు ఎక్కువ అవుతున్నాయి. తమన్నా, విజయ్ వర్మ చాలా కాలం పాటు డేటింగ్ చేశారు. ఒకానొక టైమ్ లో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ సడెన్ గా బ్రేకప్ అయ్యారు. అప్పటి నుంచి తమన్నా తన సినిమాల్లోనే బిజీగా ఉంటుంది.
Read Also : Kannappa : ప్రమోషన్లలో కనిపించని హీరోయిన్.. కారణమేంటి.?