తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పిన ‘బలగం’ సినిమా చూసి ప్రేక్షకులు ఎంతలా ఎమోషనల్ అయ్యారో మనందరికీ తెలిసిందే. సరిగ్గా అలాంటి హృదయాన్ని హత్తుకునే అనుభూతినే అందిస్తోంది ఇటీవల తమిళంలో సంచలనం సృష్టించిన ‘సిరై’ అనే ఓ చిన్న సినిమా. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఓటిటిలోకి వచ్చేసింది. టీమిండియా స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం థియేటర్‌కు వెళ్లి చూసి ఫిదా అయ్యారంటే, ఈ సినిమాలో ఎంతటి ఎమోషనల్ డెప్త్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read : OTT Movie: వరుస హత్యలతో వణికిపోతున్న ఊరు.. ఓటీటీలో ‘కాంతార’, ‘శంభాల’ రేంజ్ హారర్ థ్రిల్లర్!
ఈ కథ అంతా ‘కదిరవన్’ అనే ఒక హెడ్ కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. అబ్దుల్ రౌఫ్ అనే ఒక విచారణా ఖైదీని కోర్టుకు తరలిస్తుండగా అతను తప్పించుకుంటాడు. అసలు ఆ ఖైదీ ఎవరు? అతను చేసిన హత్య వెనుక ఉన్న గతం ఏంటి? ఒక క్రైమ్ థ్రిల్లర్‌లా మొదలైన ఈ ప్రయాణం, చివరికి ఒక అద్భుతమైన ఎమోషనల్ లవ్ స్టోరీగా మారుతుంది. పక్కా నేటివిటీతో, కళ్ళకు కట్టినట్లు ఉండే సన్నివేశాలతో సాగే ఈ మూవీ, ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తుంది. క్రైమ్ డ్రామాలను ఇష్టపడే వారితో పాటు ఎమోషనల్ సినిమాలను ప్రేమించే వారు అస్సలు మిస్ అవ్వకూడదు.