Priyanka Arul Mohan: గ్యాంగ్ లీడర్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ . ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల సరసన నటిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. బెస్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కు ప్రియాంక కు మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. శివ కార్తికేయన్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన వరుణ్ డాక్టర్ సినిమాలో ప్రియాంక హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా సమయంలోనే నెల్సన్ కు, ప్రియనకే కు మధ్య గొడవ జరిగిందని, ఆ గొడవ కారణంగానే సూపర్ స్టార్ రజిని కాంత్ సరసన నటించే అవకాశం కోల్పోయిందని కోలీవుడ్ వర్గాల టాక్.
నెల్సన్ దర్శకత్వంలో రజినీ నటిస్తున్న చిత్రం జైలర్. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రజినీ సరసన తమన్నా నటిస్తోంది. ఇక తమ్ము పాత్రను ముందు ప్రియాంకకే వినిపించారట. ఆమె నెల్సన్ తో ఉన్న గొడవ వలన ఈ సినిమాను అంగీకరించకపోవడంతో ఆ పాత్ర తమన్నాను తీసుకున్నారట. ఏది ఏమైనా ఒక మంచి అవకాశాన్ని కోల్పోయింది ప్రియాంక అని కొందరు అంటుండగా.. పర్వాలేదు.. మంచి సినిమాలు వస్తాయ్ లే అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే ప్రియాంక నోరు విప్పక తప్పదేమో..