Priyamani : సీనియర్ హీరోయిన్ ప్రియమణి నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘ది గుడ్ వైఫ్’. ఈ సిరీస్ ను రేవతి డైరెక్ట్ చేయగా.. రేపు జులై 4 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సిరీస్ పై కొన్ని రూమర్లు వస్తున్నాయి. అమెరికాలో వచ్చిన ‘ది గుడ్ వైఫ్’ సిరీస్ ను ప్రియమణి కాపీ కొట్టి ఈ గుడ్ వైప్ సిరీస్ చేస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. తాజా ప్రమోషన్లలో వాటిపై ప్రియమణి క్లారిటీ ఇచ్చింది. మేం ఎలాంటి వెబ్ సిరీస్ ను కాపీ కొట్టలేదు. ఇది పూర్తిగా మన కల్చర్ కు సంబంధించింది.
Read Also : Thammudu : మా అమ్మ ముందే సిగరెట్ తాగాను.. నటి షాకింగ్ కామెంట్స్..
మన కల్చర్ ను అద్దం పట్టేలా కొన్ని మార్పులు చేశాం. భర్త సెక్స్ కుంభకోణంలో అరెస్ట్ అయిన తర్వాత ఆ భార్య కుటుంబాన్ని ఎలా నడిపించింది, ఎలాంటి సమస్యలు, సవాళ్లు ఎదుర్కుంది అనే కోణంలో దీన్ని తీశాం. ఇందులో ఒక మహిల ఎన్ని రకాల పాత్రలు పోషిస్తుందో చూస్తారు. తల్లి, భార్య, గృహిణి లాంటి విభిన్న పాత్రల్లో నేను నటించాను. అన్ని బాధ్యతలను నెరవేర్చేందుకు ఎలాంటి కష్టాలు పడ్డానో ఇందులో చూస్తారు అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి. నా గురించి ఇలాంటి ప్రచారాలు జరగడం బాధగా ఉంది. ఇదేం కొత్త కాదు గతంలోనూ ఇలా నాపై ఫేక్ రూమర్లు క్రియేట్ చేశారు. కానీ నేను పట్టించుకోలేదు. నాకు మా అమ్మ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది. ఇండస్ట్రీలో చాలా మంది నాకు సపోర్ట్ గా ఉన్నారు. ఈ సిరీస్ సగటు ఒంటరి మహిళ కష్టాలను మీకు చూపిస్తుంది. అందరికీ నచ్చుతుంది అంటూ తెలిపింది ప్రియమణి.
Read Also : Star Heroines : ఆ పని అస్సలు చేయని ఇద్దరు స్టార్ హీరోయిన్లు..!