Star Heroines : హీరోయిన్ అంటే ఇప్పుడు బోల్డ్ సీన్లు చేయడం కామన్ అయిపోయింది. అంత కాకపోయినా కనీసం లిప్ లాక్ అయినా చేయాల్సిందే. లేదంటే అస్సలు కుదరదు. ఇప్పుడున్న హీరోయిన్లు దాదాపు అందరూ అలాంటి సీన్లలో నటించిన వారే. ఇప్పుడు అది అంతా కామన్ అయిపోయింది. అయితే ఓ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మాత్రం అస్సలు లిప్ లాక్ చేయకుండా నటిస్తున్నారు. ఆ ఇద్దరూ యాక్టింగ్ లో తోపులే. వారే సాయిపల్లవి, కీర్తి సురేష్. వీరిద్దరూ లిప్ లాక్ చేయొద్దని కండీషన్ పెట్టుకునే సినిమాల్లోకి వచ్చామని ఎన్నోసార్లు తెలిపారు. అలాంటి సీన్లు చేయాల్సి వస్తే సినిమాను అయినా వదిలేసుకుంటున్నారు తప్ప వాటికి ఒప్పుకోవట్లేదు. ఇప్పటికే కీర్తి సురేష్ మహానటిగా దూసుకుపోతోంది.
Read Also : South Heros : ఇన్ స్టాలో ఆ సౌత్ హీరో టాప్.. ఏ హీరోకు ఎంతమంది ఫాలోవర్లు..?
సాయిపల్లవి కూడా వరుస హిట్లతో ఫుల్ జోష్ మీద ఉంది. వీరిద్దరూ లిప్ లాక్ కాకుండా ఇతర పైపైన చేసే రొమాంటిక్ సీన్లలో నటించారు. అంతకు మించి ముందుకు వెళ్లలేదు. అలాంటి సీన్లు చేయాల్సి వస్తుందనే కారణంతో సాయిపల్లవి ఇప్పటికే చాలా సినిమాలను వదిలేసుకుంది. అటు కీర్తి సురేష్ కూడా అంతే. పైగా వీరిద్దరూ తమ పాత్రలకు నటించే స్కోప్ ఉంటేనే ఒప్పుకుంటారు. ఏ మాత్రం తేలికపాటి పాత్ర ఉన్నా సరే అస్సలు ఒప్పుకోరు. ఇలాంటి కండీషన్లతో స్టార్ హీరోల సినిమాలను కూడా వదిలేసుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ టాప్ సినిమాల్లో ఉన్నారు. ఇప్పటికే కీర్తి సురేష్ రెండు భారీ సినిమాలను లైన్ లో పెట్టేసింది. ఇప్పుడు సాయిపల్లవి పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న రామాయణ సినిమాలో నటిస్తోంది. ఇలా బోల్డ్ సీన్లకు దూరంగా ఉంటూ నటిస్తున్నారు కాబట్టే వీరిద్దరికీ మంచి ఫాలోయంగ్ ఉందని అంటున్నారు వారి ఫ్యాన్స్.
Read Also : Ariyana : తొమ్మిదో క్లాస్ లోనే అతన్ని లవ్ చేశా.. అరియానా బ్రేకప్ స్టోరీ..