Priya Prakash Varrier Admits her wrong Decisions: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబోలో పి. సముద్రఖని డైరెక్షన్ రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన ప్రియా ప్రకాష్ వారియర్, బ్రో సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటూనే తన కెరీర్ కు చెందిన కొన్ని విషయాలను కూడా పంచుకున్నారు. ఒక్క కన్నుగీటే వీడియోతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత మీ సినిమాల ఎంపికలో తడబాటుకు కారణం ఏమిటి అని ప్రశ్నిస్తే ఆమె స్పందించారు. నాది సినిమా నేపథ్యమున్న కుటుంబం కాదని, నన్ను సరైన మార్గంలో గైడ్ చేసేవాళ్ళు లేరని అన్నారు.
Priya Prakash Varrier: స్లీవ్ లెస్ టాప్ ధరించి కాక రేపుతున్న ప్రియా ప్రకాష్ వారియర్
ఆ వీడియో తర్వాత అందరూ రకరకాల సలహాలు ఇవ్వడంతో కొన్ని సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయానని ఒప్పుకున్న ఆమె ఇప్పుడు ఈ ప్రయాణంలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నానని పేర్కొంది. ఇప్పుడు పాత్రలు, సినిమాల ఎంపిక విషయంలో సరైన నిర్ణయం తీసుకోగలుతున్నానని పేర్కొన్న ఆమె చిన్నప్పటి నుంచి నాకు గొప్ప నటి కావాలని ఆశ ఉండేది. ఆ దిశగా నా అడుగులు సాగుతున్నాయనని ప్రియా చెప్పుకొచ్చారు. ఇక తెలుగు, మలయాళ సినిమాలకు తేడా ఏమైనా గమనించారా? అని అడిగితే తెలుగు సినిమాల బడ్జెట్, మార్కెట్ చాలా పెద్దది కానీ మలయాళంలో ఎక్కువగా కంటెంట్ ఓరియెంటెడ్ లో చిన్న సినిమాలు చేస్తుంటారని అన్నారు. అయితే ఇప్పుడు తెలుగు, మలయాళం అనే తేడా లేకుండా ఇండియన్ సినిమా అంటున్నారని, మన సినిమాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉందని, ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ కూడా వచ్చింది. కాబట్టి ఇప్పుడు భాషతో సంబంధంలేదని ఆమె అన్నారు.