Prasanth Varma: హనుమాన్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జ, అమృత అయ్యర్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. సంక్రాంతి బరిలో అసలు హనుమాన్ ఉండదేమో అనుకున్నారు. చాలామంది ఈ సినిమాను ఆపడానికి ప్రయత్నాలు కూడా చేశారు. ఈ సినిమా దర్శక నిర్మాతలు కూడా ఆ విషయాన్నీ బాహాటంగానే చెప్పుకొచ్చారు. తమను బెదిరించారని కూడా తెలిపారు. అయినా కూడా సినిమాపై ఉన్న నమ్మకంతో స్క్రీన్స్ తక్కువ ఇచ్చినా కూడా వెనుకంజ వేయకుండా హనుమాన్ ను రిలీజ్ చేశారు. ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. ఇంత తక్కువ బడ్జెట్ లో ఇలాంటి అవుట్ పుట్ ను ఊహించలేదని, సినిమా చాలా బావుందని ప్రశంసలు అందుకుంటున్నాడు. సక్సెస్ మాత్రమే కాదు రికార్డ్ కలక్షన్స్ కూడా అదిరిపోయాయి. ఇక ఒక సక్సెస్ అందుకున్నాకా.. అందరికి ట్రోల్స్ రావడం అనేది సాధారణమే.
తాజాగా ప్రశాంత్ వర్మపై కూడా అలాంటి నెగెటివిటీని స్ప్రెడ్ చేయడానికి పూనుకున్నారు కొంతమంది. సినిమా సక్సెస్ అయ్యిందని, తనను తాను గొప్పగా ఫీల్ అవుతున్నట్లు, చిరంజీవి డిన్నర్ కు పిలిచి.. రామ్ చరణ్ ఆఫర్ ఇచ్చినా రిజెక్ట్ చేసినట్లు నెట్టింట వైరల్ గా మారింది. ప్రశాంత్ వర్మ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ వైరల్ గా మారింది. అందులో.. ” హనుమాన్ సక్సెస్ అయ్యినందుకు నన్ను డిన్నర్ కు ఆహ్వానించారు. అంతేకాకుండా ఆయన రామ్ చరణ్ తో ఒక సినిమా చేయమని అడిగారు. కానీ, నేను నో చెప్పాను. కేవలం నేను స్టార్ హీరోలతోనే సినిమా చేస్తాను” అని రాసుకొచ్చాడు. దీంతో ఏంటి ఇది నిజమా అని అనుకున్నారు. కానీ, అదంతా ఫేక్ అని ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. ఈ ట్వీట్ చేసిన అకౌంట్ ఫేక్ అని తేల్చి చెప్పాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Fake account alert‼️ https://t.co/n8GSocR32U
— Prasanth Varma (@PrasanthVarma) January 14, 2024