‘కంచె’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో టాలీవుడ్ లో ప్రగ్యా ఓ రేంజ్ హీరోయిన్ల లిస్టులో ఉండిపోతుంది అనుకున్నారు. కానీ, అమ్మడికి మాత్రం ఆ సినిమా తరువాత అవకాశాలు అంది అందనట్టుగానే వచ్చాయి. ఇక కొన్ని సినిమాల్లో ప్రత్యేక గీతాలలో కనిపించి మెప్పించిన ఈ భామకు లక్కీ ఛాన్స్ అఖండ ద్వారా అందింది. బాలకృష్ణ సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ అఖండ విజయాన్ని అందుకోంది. ఇక ఈ సినిమా తర్వాత అమ్మడి దశ తిరిగిపోయింది అనే చెప్పాలి. వరుస అవకాశాలను అందుకుతునన్ ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. బంగారు వర్ణం చీరలో బంగారు బొమ్మలా మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.