PrabhasMaruthi: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ ఒక మాట చెప్పాడు. ఏడాదికి ఒక సినిమా కాదు.. ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తాను అని.. ఇచ్చిన మాట మీద నిలబడడంలో ప్రభాస్ ముందు ఉంటాడు. చెప్పిన విధంగానే ఏడాదికి రెండు మూడు సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. ఈ ఏడాది ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను నిరాశపర్చినా.. సలార్ తో వచ్చి ఫ్యాన్స్ ఆకలిని తీర్చాడు. ఇక ప్రస్తుతం సలార్ మ్యానియా ఇంకా తగ్గనే లేదు. అప్పుడే కల్కి మ్యానియా మొదలైపోయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే రేపు ఐఐటీ బాంబే ఫెస్ట్ కు నాగ్ అశ్విన్ హాజరవుతున్నాడు. ఆ మీట్ లో కల్కి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకోనున్నాడు. ఇదే పెద్ద అప్డేట్ అంటే.. మరో కొత్త అప్డేట్ రేపు ఉండబోతుంది. ఈ విషయాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా చెప్పుకొచ్చింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తుంది. ఇన్ని పాన్ ఇండియా సినిమాల మధ్య ప్రభాస్ ఇలాంటి చిన్న సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ తో పాటు మరో ఇద్దరు భామలు నటిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా అప్డేట్ వస్తుందా.. ? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక పీపుల్ మీడియా అధికారికంగా ఒక అప్డేట్ ఇస్తున్నాం వేచి చూడండి అని చెప్పడంతోనే అది ప్రభాస్ మారుతీ సినిమా నుంచే అని అందరికీ అర్థమైపోయింది. రేపు ఉదయం 8.34 కు ఈ అప్డేట్ రానుందని మేకర్స్ తెలిపారు. ఇక రేపు ఒకపక్క కల్కి.. ఇంకోపక్క ప్రభాస్ మారుతీ సినిమా అప్డేట్.. డార్లింగ్ ఫ్యాన్స్ కు రేపు పండగే. మరి రేపు ఆ అప్డేట్ ఏంటో చూడాలంటే వేచి చూడాల్సిందే.