Prabhas vs Shah Rukh Khan: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రశాంత్ నీల్ ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించగా శృతి హాసన్, పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రేయ రెడ్డి, ఝాన్సీ వంటి పలువరు స్టార్స్ ఇందులో కీలక పాత్రల్లో నటించారు. ఇక రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది, రివ్యూలు కూడా పాజిటివ్ గా రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు రూ.178 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా హిందీ బెల్టులో షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాకు పోటీగా బరిలోకి దిగింది. నిజానికి షారుఖ్ ఖాన్ ఈ ఏడాది జవాన్, పఠాన్ వంటి సినిమాలతో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే డంకీ మాత్రం కేవలం హిందీలో రిలీజ్ చేశారు, పాన్ ఇండియా సినిమాగా దీనిని రిలీజ్ చేయలేదు.
Manasa Priyatham: బుల్లితెర జంట విడాకులు.. టార్చర్ అనుభవిస్తున్నా.. సిగ్గులేకుండా చెప్తున్నా
రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించిన ఈ చిత్రం హిందీ ప్రేక్షకులను సైతం అందరినీ మెప్పించలేక పోయింది. ఇక మొదటి రోజు కలెక్షన్స్ కంపేర్ చేస్తే డంకి మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్ట్ చేసిన మొత్తాన్ని సలార్ సినిమా ఓవర్సేస్ లో కలెక్ట్ చేసింది. ‘డంకీ’ మూవీకి మొదటి రోజు ఇండియాలో రూ. 40 కోట్ల గ్రాస్ సంపాదించగా ప్రపంచవ్యాప్తంగా 60 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక రెండో రోజు విషయానికి వస్తే.. ఇండియాలో 20 కోట్ల రూపాయలు రాగా.. ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చెబుతున్నారు. సలార్ హిందీలో ఈ మూవీ 25 కోట్లకు పైగానే వసూలు చేసినట్లు చెబుతుండగా ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఈ మూవీ రూ.178 కోట్లు వసూలు చేసిందని అంటున్నారు. డంకీ మొదటి రోజు రూ. 60 గ్రాస్ , ప్రభాస్ సలార్ రూ. 175 కోట్లు గ్రాస్‌ను సాధించడంతో బాక్సాఫీస్ ప్రభావం పరంగా SRK కంటే ప్రభాస్ దాదాపు మూడు రెట్లు ఎక్కువ అని అంటున్నారు.