Manasa Priyatham: బుల్లితెర జంట విడాకులు.. టార్చర్ అనుభవిస్తున్నా.. సిగ్గులేకుండా చెప్తున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manasa Priyatham: సెలబ్రిటీలు ప్రేమలు, పెళ్లిళ్లు.. విడాకులు ఎప్పుడు జరుగుతాయో ఎవరికి తెలియదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోతున్నారు. ఈ ఏడాది ఎంతోమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోయారు. తాజాగా ఒక బుల్లితెర జంట విడిపోయినట్లు తెలుస్తోంది. బుల్లితెర హీరో ప్రియతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసు మమత సీరియల్ తో అతను కెరీర్ ప్రారంభించాడు. ఈ సీరియల్ సూపర్ హిట్ గా నిలవడంతో ప్రియతమ్ చరణ్ కు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇకపోతే ప్రస్తుతం పాపే మా జీవనజ్యోతి సీరియల్ లో నటిస్తున్నాడు. ఇక చరణ్.. నటి మానసను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎన్నో షోస్ లలో పాల్గొన్నారు కూడా. అయితే గతకొంతకాలంగా ఈ జంట మధ్య విబేధాలు తలెత్తడంతో విడిగా ఉంటున్నారని తెలుస్తోంది. కొన్నిరోజుల నుంచి మానస చేసే యూట్యూబ్ వ్లాగ్స్ లో చరణ్ ఎక్కడా కనిపించడం లేదు. దీంతో అభిమానులందరూ.. చరణ్ తో మీరు విడిపోయారా.. ? విడాకులు తీసుకున్నారా.. ? అని ప్రశిస్తుంటే.. చివరికి మానస తన మనసులోని మాటను బయటపెట్టింది.
చరణ్, తానూ విడాకులు తీసుకోలేదు కానీ విడిగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఇద్దరం తప్పులు చేశామని, కానీ, ఆ ఫలితం మాత్రం తానే అనుభవిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తనకున్న సంపాదన కేవలం ఈ యూట్యూబ్ మాత్రమే అని, ఆ విషయాన్నీ సిగ్గులేకుండా చెప్తున్నా అని చెప్పుకొచ్చింది. గత నాలుగు నెలలుగా ప్రతిఒక్కరు ఇదే విషయాన్నీ అడిగి టార్చర్ చేస్తున్నారని, అందుకే ఇప్పుడు చెప్తున్నట్లు తెలిపింది. విడాకులు కావాలని కూడా కోరుకోవట్లేదని, కానీ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నామని చెప్పింది. ఇప్పుడు కూడా తాను స్టాండ్ తీసుకోకపోతే తన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని ఆందోళనగా ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
తాజావార్తలు
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!