బాహుబలితో ఎన్నో చెరిగిపోని రికార్డ్స్ క్రియేట్ చేశారు ప్రభాస్, రాజమౌళి. ఇప్పటి వరకు బాహుబలి 2 రికార్డ్‌ను టచ్ చేసే సినిమా ఒక్కటి కూడా రాలేదు. ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్‌గా అమీర్ ఖాన్ ‘దంగల్’ టాప్ ప్లేస్ ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నప్పటికీ… సరైన లెక్కలతో పోలిస్తే బాహుబలి2నే టాప్ ప్లేస్ ఉంటుంది. అలాంటి సినిమాను కొట్టే సినిమా ఏదంటే? ఇప్పుడే దానికి సమాధానం చెప్పలేం. మళ్లీ ఈ రికార్డ్‌ను టచ్ చేయాలంటే ప్రభాస్ లేదంటే రాజమౌళి వల్లే సాధ్యమవుతుంది. నెక్స్ట్ మహేష్ బాబు సినిమాతో రాజమౌళి… తన రికార్డ్‌ను తనే బీట్ చేసే ఛాన్స్ ఉంది లేదంటే.. సలార్ 2తో ప్రభాస్ బాహుబలి రికార్డుల కోటను బద్దలు చేసేలా ఉన్నాడు. ఎందుకంటే… సరిగ్గా బాహుబలి విషయంలో జరిగినట్టుగానే సలార్ విషయంలో జరుగుతోంది.
Read Also: Devara: ఎన్టీఆర్ నమ్మకం విలువెంతో నిరూపిస్తాడు కొరటాల…
బాహుబలి పార్ట్ 1 బాక్సాఫీస్ దగ్గర 650 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది కానీ పార్ట్ 1 ఇచ్చిన హైప్‌తో బాహుబలి 2 ఏకంగా 1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియట్ చేసింది. సరిగ్గా ఇప్పుడు సలార్‌తో హిస్టరీ రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం సలార్ పార్ట్ 1.. 650 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే… ప్రశాంత్ నీల్ సలార్ సీజ్ ఫైర్‌లో… అసలు కథ మొత్తం సెకండ్ పార్ట్ శౌర్యాంగ పర్వంలో ఉంటుందని చెప్పేశాడు. దీంతో సలార్ 2 కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి బాహుబలి హిస్టరీ రిపీట్ అయితే… సలార్ 2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరో సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు. ఇదే విషయాన్ని చెబుతూ… సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి సలార్ 2 ఎప్పుడుంటుంది? హిస్టరీ రిపీట్ అవుతుందా? లేదా? అనేది చూడాలి.