తెలుగు సినిమా పంథాని మార్చిన వాడు రామ్ గోపాల్ వర్మ అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల పంథా మార్చింది మాత్రం డెఫినెట్ గా కొరటాల శివ మాత్రమే. స్టార్ హీరో చేసే రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి శంకర్ స్టైల్ లో సోషల్ కాజ్ ని కలుపుతూ కథని నడిపించడం కొరటాల శివ స్టైల్ ఆఫ్ రైటింగ్. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు… ఇలా ఏ స్టార్ హీరోతో సినిమా చేసినా అభిమానుల కోసం మాస్ స్టఫ్ ఇస్తూనే సోషల్ కాజ్ టచ్ ఇవ్వడం మాత్రం కొరటాల శివ ఏ రోజు వదలలేదు. సింపుల్ గా చెప్పాలి అంటే మాస్ లందు కొరటాల మార్క్ మాస్ వేరయా అన్నట్లు కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పాడు కొరటాల శివ. నాన్-బాహుబలి హిట్ ఇచ్చిన కొరటాల శివ లాంటి రైటర్ డైరెక్టర్ ని ఒక్క సినిమా కిందకి లాగేసింది. ఆకాశం అంత ఎత్తులో ఉన్న కొరటాలని పాతాళానికి పడేసింది.
‘ఆచార్య’… చిరు హీరోగా చరణ్ గెస్టు రోల్ లో నటించిన ఈ మూవీ కొరటాల శివని ఎవరు కలలో కూడా ఊహించనంత డౌన్ ఫాల్ లోకి తీసుకోని వెళ్లింది. ఆచార్య రిలీజ్ అయిన రోజు నుంచి కొన్ని నెలల పాటు కొరటాల శివ అసలు బయట కనిపించకుండా పోయాడు అంటే ఆన్-లైన్ ఆఫ్-లైన్ లో ఎంత ట్రోలింగ్ ఫేస్ చేసాడో అర్ధం చేసుకోవచ్చు. చిరు లాంటి హీరోకి ఆచార్య లాంటి ఫ్లాప్ ఇచ్చిన తర్వాత, అంత నష్టాలని మిగిలించిన తర్వాత ఏ దర్శకుడికి అయినా ఇంకో సినిమా రావాలి అంటే చాలా సమయం పడుతుంది. ఇది చాలదన్నట్లు అప్పటికే ఓకే చేసిన సినిమాలు కూడా క్యాన్సిల్ అవుతాయి. ఇది ఇండస్ట్రీ సత్యం… కానీ ఎన్టీఆర్ అలా చేయలేదు. కొరటాల శివని నమ్మాడు.
అప్పటికే అనౌన్స్ చేసిన ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయమని అభిమానులు కోరుకున్నా కూడా ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ పక్కన నిలబడ్డాడు. ఎన్టీఆర్ కొరటాల శివపై పెట్టుకున్న నమ్మకం, ఎన్టీఆర్ కొరటాల శివకి ఇచ్చిన బ్యాకింగ్ ఈరోజు… దేవర సినిమా గురించి ఇండియా మొత్తం మాట్లాడుకునేలా చేస్తోంది. గ్లిమ్ప్స్, టీజర్, ట్రైలర్ కూడా బయటకి వస్తే ఎన్టీఆర్ కోసం కొరటాల శివ ఎలాంటి ప్రపంచాన్ని సృష్టించాడు, ఎన్టీఆర్ ఎందుకు కొరటాల శివని అంతగా నమ్మాడు అనే విషయం తెలుస్తోంది. మరి జనవరి 8న వచ్చే దేవర గ్లిమ్ప్స్ తోనే తన కంబ్యాక్ కి కేవలం తెలుగు రాష్ట్రాలకి మాత్రమే కాకుండా పాన్ ఇండియా మొత్తం వినిపించేలా కొరటాల శివ చేస్తాడేమో చూడాలి.