The Rajasaab : ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెరదించే సమయం వచ్చిందని తెలుస్తోంది. ది రాజాసాబ్ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. డబ్బింగ్ పనులు కూడా అయిపోయినట్టు తెలుస్తోంది. రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే మూవీ టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. అన్నీ కుదిరితే జూన్ 6న మూవీ టీజర్ రాబోతోంది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో అప్డేట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ ది రాజాసాబ్ పాత్రలో కనిపించబోతున్నాడు.
Read Also : YS Jagan Fan: అరగుండు గీయించుకున్న జగన్ వీరాభిమాని.. ఎందుకంటే..?
భూత, వర్తమాన కాలాన్ని బట్టి ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రభాస్ ఇలాంటి హర్రర్ సినిమాలో నటించలేదు. టాలీవుడ్ లోని ఏ స్టార్ హీరో కూడా ఇలాంటి దెయ్యం మూవీలో కనిపించలేదు. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ వచ్చిన తర్వాత మూవీపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప ఇంకెలాంటి అప్డేట్లు ఈ సినిమా నుంచి రాలేదు. ఇక నుంచి వరుసగా అప్డేట్లు ఉంటాయని చెబుతున్నారు. మూవీని డిసెంబర్ 5న రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
Read Also : Sree Leela : శ్రీలీల ఎంగేజ్ మెంట్..? ఫొటోలు వైరల్..!