Prabhas : పాన్ ఇండియా హీరో ప్రభాస్ పెళ్లిపై నిన్నటి నుంచి జోరుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందని.. అతి త్వరలోనే పెళ్లి జరుగుతందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. పైగా రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షోలో చేసిన కామెంట్స్ ను కూడా దీనికి సింక్ చేసేశారు. గణపవరంకు చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని రామ్ చరణ్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజం అయ్యాయని.. ఏపీకి చెందిన అమ్మాయి కుటుంబం హైదరాబాద్ లో సెటిల్ అయిందని.. ఇరువురి కుటుంబాలు మాట్లాడుకున్నారంటూ ఓ తెగ పోస్టులు పెట్టేశారు. దీంతో ప్రభాస్ టీమ్ ఎట్టకేలకు స్పందించింది.
Read Also : Deputy CM Pawan Kalyan: పిఠాపురంపై పవన్ కల్యాణ్ రివ్యూ.. కీలక సూచనలు
అసలు ప్రభాస్ పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చేసింది. ఏదైనా ఉంటే తామే స్వయంగా ప్రకటిస్తామని.. అప్పటి వరకు ఫ్యాన్స్ ఇలాంటివి నమ్మొద్దని ప్రభాస్ టీమ్ వెల్లడించింది. కొందరు మీడియా ప్రతినిధులు ఈ విషయంపై ప్రభాస్ టీమ్ ను వివరణ కోరగా.. ఈ విధంగా క్లారిటీ ఇచ్చేశారు. గతంలో కూడా హీరోయిన్ కృతిసనన్ తో పెళ్లి అంటూ రూమర్లు క్రియేట్ అయ్యాయి. అప్పుడు ఇద్దరూ స్వయంగా దీనిపై స్పందించాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ వయసు 45 ఏళ్లు. ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడు. త్వరలోన ప్రభాస్ పెళ్లి ఉంటుందని స్వయంగా శ్యామలాదేవి కూడా ప్రకటించారు. కానీ ఆ గుడ్ న్యూస్ మాత్రం ఇంకా రావట్లేదు. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, ది రాజాసాబ్ సినిమా షూట్ లలో బిజీగా ఉటున్నాడు. ఈ ఏడాది చివరికల్లా స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.