Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spirit Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి మేకర్స్ నుంచి కీలక స్పష్టత వచ్చింది. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందంటూ ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని మేకర్స్ ఖండించారు. ఈ సినిమా రిలీజ్ డేట్లో ఎలాంటి మార్పు లేదని, ముందుగా ప్రకటించిన ప్రకారమే 2027 మార్చి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టీమ్ సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. షూటింగ్ కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతున్నట్లు సమాచారం. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను అదే స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
‘స్పిరిట్’లో ప్రభాస్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు డార్లింగ్ తన కెరీర్లో చేయని విధంగా తొలిసారి పోలీస్ పాత్రలో నటిస్తుండటంతో ఈ క్యారెక్టర్‌పై అభిమానుల్లో భారీ క్రేజ్ నెలకొంది. ఇప్పటికే ప్రభాస్ లుక్, మేకోవర్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సందీప్ రెడ్డి వంగా తనదైన స్టైల్లో హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్, ఎమోషన్, పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్‌తో సినిమా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో భూషణ్ కుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రిలీజ్ డేట్‌పై వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ.. 2027 మార్చి 5న ‘స్పిరిట్’ థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Also Read
- Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
- Sowcar Janaki Health: సీనియర్ నటి 'షావుకారు' జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స!
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Helicopter Crash: కూలిన హెలికాప్టర్.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐదుగురు అమెరికా పౌరులతో సహా ఏడుగురు మృతి
-
IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
-
Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!