Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
How to Grow Lemon Plant: వేసవిలో పెరుగు ఎంతగా ఇష్టపడతారో.. నిమ్మకాయలకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. నిమ్మరసం తయారు చేయడానికి, అలాగే వంటకాల్లో వినియోగంకు, సలాడ్ రుచిని పెంచడానికి ఇలా దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉపయోగిస్తుంటారు. డిమాండ్ పెరిగే సమయంలో నిమ్మకాయల ధరలు కూడా పెరుగుతుంటాయి. దీంతో అవసరం ఉన్నప్పటికీ కొందరు కొనుగోలు చేయడానికి ఆలోచిస్తుంటారు. అయితే ఇంట్లో బాల్కనీ, మేడ లేదా ఆవరణలో కొద్దిగా స్థలం ఉంటే కుండీలోనే నిమ్మ మొక్కను పెంచుకోవచ్చు.
నిమ్మ మొక్కను పెంచడానికి పెద్ద తోట లేదా ఎక్కువ స్థలం అవసరం లేదు. సరైన పరిమాణంలో ఉన్న కుండీ, నాణ్యమైన మట్టి, తగినంత సూర్యరశ్మి, క్రమం తప్పకుండా సంరక్షణ ఉంటే ఇంట్లోనే నిమ్మ మొక్కను ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. ఇంట్లో ఉపయోగించే నిమ్మకాయ నుంచి తీసిన విత్తనాలతో మొక్కను తయారు చేసుకోవచ్చు. లేదంటే నర్సరీ నుంచి నేరుగా నిమ్మ మొక్కను తీసుకొచ్చి కుండీలో నాటుకోవచ్చు.
Also Read
- Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
- Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
- Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
నిమ్మ మొక్కను నాటేందుకు చిన్న కుండీని ఉపయోగించకూడదు. మొక్క వేర్లు విస్తరించేందుకు తగినంత స్థలం ఉండే కుండీని ఎంచుకోవాలి. కుండీ అడుగున నీరు బయటకు వెళ్లేందుకు రంధ్రాలు తప్పనిసరిగా ఉండాలి. లేదంటే అదనపు నీరు కుండీలోనే నిలిచిపోయి మొక్క వేర్లకు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. మట్టిని సిద్ధం చేసేటప్పుడు సాధారణ మట్టిలో బాగా కుళ్లిన పశువుల ఎరువును కలపవచ్చు. దీనివల్ల మట్టికి అవసరమైన పోషకాలు అందడంతో పాటు మొక్క ఎదుగుదలకు సహాయపడుతుంది.
నిమ్మకాయ విత్తనాలతో మొక్కను పెంచాలనుకుంటే ముందుగా ఆరోగ్యంగా ఉన్న నిమ్మకాయ నుంచి మంచి విత్తనాలను సేకరించాలి. వాటిని సుమారు ఒక రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు కుండీలో సిద్ధం చేసుకున్న మట్టిలో విత్తనాలను సుమారు 2 నుంచి 3 అంగుళాల లోతులో నాటాలి. ఆపై వాటిపై పలుచగా మట్టిని కప్పాలి. అయితే విత్తనం నుంచి మొక్కను పెంచడానికి ఎక్కువ సమయం పడుతుంది. త్వరగా మొక్కను సిద్ధం చేసుకోవాలనుకుంటే నర్సరీ నుంచి ఆరోగ్యంగా ఉన్న నిమ్మ మొక్కను తీసుకొచ్చి నేరుగా కుండీలో నాటుకోవడం సులభమైన మార్గం.
నిమ్మ మొక్కకు మంచి సూర్యరశ్మి అందే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. బాల్కనీ, మేడ లేదా ఇంట్లో రోజులో ఎక్కువసేపు వెలుతురు, సూర్యరశ్మి వచ్చే ప్రాంతంలో కుండీని ఉంచవచ్చు. మొక్కకు తగినంత సూర్యరశ్మి అందితే దాని ఎదుగుదల మెరుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. నిమ్మ మొక్కకు నీరు అవసరమే అయినప్పటికీ కుండీలో ఎప్పుడూ నీరు నిలిచి ఉండేలా చేయకూడదు. మట్టి తేమను పరిశీలించి అవసరమైనప్పుడు మాత్రమే నీరు పోయాలి. మట్టి ఎప్పుడూ ఎక్కువగా తడిగా ఉంటే మొక్క వేర్లు దెబ్బతినడంతో పాటు వేర్లు కుళ్లిపోయే సమస్య కూడా ఏర్పడవచ్చు. సులభంగా చెప్పాలంటే.. కుండీలోని మట్టి పైభాగంలో సుమారు ఒక అంగుళం పొర పొడిగా అనిపించినప్పుడు మొక్కకు తగినంత నీరు పోయాలి. నీరు పోసిన తర్వాత అదనపు నీరు డ్రైనేజీ రంధ్రాల ద్వారా బయటకు వెళ్లేలా చూసుకోవాలి.
నిమ్మ మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే ఎప్పటికప్పుడు ఎరువు అందించడం కూడా అవసరం. సేంద్రియ ఎరువును నెలకు ఒకసారి మట్టిలో కలపవచ్చు. దీనివల్ల మొక్కకు అవసరమైన పోషకాలు లభించి మంచి ఎదుగుదలకు సహాయపడతాయి. నిమ్మ మొక్కను నాటిన వెంటనే పండ్లు వస్తాయని ఆశించకూడదు. ముఖ్యంగా విత్తనాల నుంచి పెంచిన మొక్క ఫలాలు ఇవ్వడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. సాధారణంగా విత్తనం నుంచి పెంచిన నిమ్మ మొక్కకు సుమారు 3 సంవత్సరాల తర్వాత నిమ్మకాయలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నిమ్మ మొక్కను పెంచడంలో సహనం, సరైన నీరు, తగినంత సూర్యరశ్మి, క్రమం తప్పకుండా ఎరువు వేయడం వంటి అంశాలు చాలా ముఖ్యం. ఇంట్లోనే తాజా నిమ్మకాయలు కావాలనుకునే వారు ఇప్పటి నుంచే కుండీలో నిమ్మ మొక్కను పెంచడం మంచిది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?