Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన అన్నయ్య, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి వెండితెరపై కనిపించాలన్న తన కోరికను బయటపెట్టారు. ఇటీవల ‘కొరియన్ కనకరాజు’తో మంచి సక్సెస్‌ను అందుకున్న ఆయన.. ఈ సినిమా సక్సెస్‌తో పాటు తన కెరీర్, రాబోయే ప్రాజెక్టుల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గత ఐదేళ్లుగా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో కొంత ఒత్తిడికి గురైనట్లు ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తెలిపారు. అయితే ‘కొరియన్ కనకరాజు’కు ప్రేక్షకుల నుంచి లభించిన స్పందనతో ఇప్పుడు ఎంతో రిలీఫ్‌గా ఉందన్నారు. నటుడిగా ఒకే తరహా జానర్‌కు పరిమితం కావడం తనకు ఇష్టం లేదని.. విభిన్న పాత్రల్లో నటిస్తూ తనను తాను నిరూపించుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. కరోనా తర్వాత ఓటీటీ ప్రభావం పెరిగినప్పటికీ.. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చినప్పుడు వారికి పూర్తిస్థాయి వినోదాన్ని అందించడం చాలా ముఖ్యమని తాను అర్థం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రేక్షకులు థియేటర్లోకి వచ్చిన తర్వాత తమ ఒత్తిళ్లను మరిచిపోయేలా సినిమా ఉండాలని అభిప్రాయపడ్డారు.
త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న స్పోర్ట్స్ డ్రామా ‘బరి’ గురించి కూడా వరుణ్ తేజ్ మాట్లాడారు. గతంలో తాను నటించిన ‘గని’లో క్రీడలతో పాటు పలు అంశాలను కలపడం వల్ల కథ కొంత గందరగోళంగా అనిపించిందని అంగీకరించారు. అయితే ‘బరి’ మాత్రం పూర్తిగా క్రీడా నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా అని, ఇందులో స్టోరీ ఎంతో సహజంగా, వాస్తవికంగా ఉంటుందని వెల్లడించారు. ఈ సినిమా ఆలోచన తన సోదరి నిహారిక నుంచి వచ్చిందని వరుణ్ తేజ్ వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో ఓ రొమాంటిక్ చిత్రానికి అంగీకరించినట్లు వరుణ్ తేజ్ తెలిపారు. తన వయసుకు తగ్గ కథతో ఈ సినిమా తెరకెక్కనుందని, రొటీన్ లవ్ స్టోరీలకు భిన్నమైన శైలిలో ఈ సినిమా ఉంటుందని వెల్లడించారు. రామ్ చరణ్‌తో కలిసి సినిమా చేయాలన్న తన కోరికను వరుణ్ తేజ్ మరోసారి స్పష్టం చేశారు. చరణ్ స్టార్ హీరోగా ఎదిగిన తీరును, ప్రతి సినిమా కోసం ఆయన పడే కష్టాన్ని తాను ఎంతో స్ఫూర్తిగా తీసుకుంటానని చెప్పారు. “చరణ్ అన్నయ్య స్టార్ హీరో. తన సినిమాల కోసం ఆయన పడే కష్టాన్ని చూసి నేను ఎంతో స్ఫూర్తి పొందుతుంటాను. చరణ్ అన్నతో కలిసి ఒక సినిమా చేయాలన్నది నా కోరిక” అని వరుణ్ తేజ్ ఈ సందర్భంగా తన మనసులోని మాటను వెల్లడించారు. నిజానికి తాను మొదట చిత్ర పరిశ్రమలోకి డైరెక్టర్ కావాలనే ఆలోచనతో అడుగుపెట్టినట్లు వరుణ్ తెలిపారు. భవిష్యత్తులో డైరెక్షన్ వైపు కూడా తప్పకుండా అడుగులు వేస్తానని చెప్పారు.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!