Sowcar Janaki Health: సీనియర్ నటి ‘షావుకారు’ జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sowcar Janaki on Ventilator: తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటి ‘షావుకారు’ జానకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను వారం రోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో బుధవారం రాత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కి తరలించారు. 95 ఏళ్ల షావుకారు జానకి ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.
చెన్నైలోని ఆల్వార్‌పేటలో నివసిస్తున్న జానకి.. వయోభారంతో కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నిన్న రాత్రి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నారు. జానకి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఆమె త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. షావుకారు జానకి 1931లో జన్మించారు. 1950లో విడుదలైన ‘షావుకారు’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తొలి సినిమానే ఆమెకు గుర్తింపును తీసుకురావడంతో.. అప్పటి నుంచి ‘షావుకారు జానకి’గా సినీ ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
షావుకారు సినిమా అనంతరం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన జానకి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో శివాజీ గణేశన్, ఎంజీఆర్, జెమినీ గణేశన్ వంటి పలువురు దిగ్గజ నటులతో కలిసి నటించారు. కథానాయికగా మాత్రమే కాకుండా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించిన జానకి దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు.
కళారంగానికి చేసిన విశేష సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022లో షావుకారు జానకిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆమె తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితురాలు. ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న జానకి ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సుదీర్ఘ సినీ ప్రస్థానంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న జానకి త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!