Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shahid Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కాల్సిన భారీ మైథలాజికల్ యాక్షన్ మూవీ ‘అశ్వద్ధామ: ది సాగా’కు బ్రేక్ పడింది. ఈ ప్రాజెక్ట్ ఇకపై పట్టాలెక్కదని నిర్మాత జాకీ భగ్నాని ఇటీవల ప్రకటించారు. సినిమా ఆగిపోవడానికి పలు కారణాలు ఉన్నాయని వెల్లడించిన ఆయన.. ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ కూడా వాటిలో ఒక కారణమని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డైరెక్టర్ ఆదిత్య ధర్ గతంలో విక్కీ కౌశల్‌తో ‘అశ్వద్ధామ’ కథను తెరకెక్కించాలని భావించారు. ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చకపోవడంతో ఇదే కథను షాహిద్ కపూర్‌తో తెరకెక్కించేందుకు నిర్మాత జాకీ భగ్నాని ప్రయత్నించారు. కన్నడ డైరెక్టర్ సచిన్ బి.రవి దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించనున్నట్లు సుమారు రెండేళ్ల క్రితం అధికారికంగా ప్రకటించారు. అయితే అనేక కారణాల వల్ల ఇప్పటివరకు షూటింగ్ ప్రారంభం కాలేదు.
తాజాగా ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిలిపివేసినట్లు ప్రకటించిన జాకీ భగ్నాని.. సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే భారీగా పెరగడం, విదేశాల్లో షూటింగ్ చేయాల్సి రావడం వంటి అంశాలను ప్రధాన కారణాలుగా వెల్లడించారు. వీటితో పాటు ‘కల్కి 2898 ఏడీ’ కూడా తమ ప్రాజెక్ట్‌పై ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ప్రత్యేకంగా ‘కల్కి 2898 ఏడీ’లో అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వద్ధామ పాత్రకు వచ్చిన స్పందన కూడా తమ సినిమాకు ప్రతికూలంగా మారిందని నిర్మాత అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఒకే తరహా కథను మళ్లీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే వారు ఆదరించరని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకులు సినిమా కోసం ఎంత ఖర్చు చేశారనే దానికంటే.. కథలో ఎంత కొత్తదనం ఉందో చూస్తున్నారని, సరైన కంటెంట్ లేకుండా భారీగా డబ్బు పెట్టుబడి పెట్టడం వృథా అని జాకీ భగ్నాని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ‘అశ్వద్ధామ: ది సాగా’ కాన్సెప్ట్‌ను కొత్త కోణంలో పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని భావించి ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ‘కల్కి 2898 ఏడీ’లో అశ్వద్ధామ పాత్ర ఉండటమే ఈ సినిమాను ఆపేయడానికి ఏకైక కారణం కాదని.. బడ్జెట్, షూటింగ్ ప్రణాళికలు సహా పలు అంశాలు ప్రభావం చూపినట్లు స్పష్టమవుతోంది. ఇక ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ విషయానికి వస్తే.. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 60 శాతానికి పైగా పూర్తయినట్లు సమాచారం. డైరెక్టర్ నాగ్ అశ్విన్ వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పక్కగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Navya Nanda: అమ్మ డ్రెస్‌తోనే ట్రెండ్ సెట్ చేసిన అమితాబ్ మనవరాలు.. గోల్డెన్ లుక్‌తో సోషల్ మీడియా షేక్!
- The Paradise : 'ది ప్యారడైజ్'కు అనిరుధ్ టెన్షన్.. రిలీజ్‌కు కేవలం 14 రోజులు మాత్రమే
- Prabhas - Nbk : ప్రభాస్ ఫౌజీ - బాలయ్య 'దాదా'లకు OTT సంస్థల స్ట్రిక్ట్ కండిషన్స్
- Nora Fatehi Defamation Case: ‘టాయ్ ప్లేన్’ అంటూ వీడియోలు.. ఐటమ్ భామ నోరా ఫతేహిపై రూ.3 కోట్ల పరువు నష్టం కేసు!
తాజావార్తలు
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
BRS MLAs: కేటీఆర్, హరీశ్‌రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్ట్
-
Asian Games Cricket Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 3న రెండు దేశాల్లో టీమిండియా మ్యాచ్‌లు!
-
Rohit Sharma: బుల్లితెరపై రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్!
-
Steel Tap Cleaning Tips: జిడ్డుగా మారిన స్టీల్ ట్యాప్‌ల క్లీనింగ్‌కు బెస్ట్ చిట్కా.. 2 నిమిషాల్లో క్లీనింగ్
ట్రెండింగ్
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!