మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
- నోకియా 125 4G 2nd ఎడిషన్ త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశం
- 2.4 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, 320 × 240 పిక్సెల్స్ రిజల్యూషన్
- ముందు, వెనుక 0.3MP కెమెరాలు, వెనుక కెమెరాకు ఎల్ఈడీ ఫ్లాష్
- 64MB ర్యామ్, 128MB ఇంటర్నల్ స్టోరేజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nokia 125 4G 2nd Edition: హెచ్ఎండీ (HMD) గ్లోబల్ మరో కొత్త నోకియా (Nokia) ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తుంది. కొత్తగా నోకియా 125 4G 2nd ఎడిషన్ ఆన్లైన్లో కనిపించింది. లీకైన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ గతంలో వచ్చిన నోకియా 210 4Gకు దగ్గరగా ఉండే స్పెసిఫికేషన్లతో రానుంది. ఈ ఫోన్ రెండు రంగుల్లో అందుబాటులోకి రాబోతుంది. ఇందులో డార్క్ బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్లు ఉండనున్నాయి. ఫోన్ ముందు భాగంలో 2.4 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేను అందించనున్నారు. ఈ స్క్రీన్ 320 × 240 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది.
కెమెరాల విషయానికి వస్తే.. ముందు, వెనుక భాగాల్లో 0.3MP కెమెరాలను అందించనున్నట్లు లీక్ వెల్లడించింది. వెనుక కెమెరాకు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉండనుంది. ఇవి అధునాతన ఫోటోగ్రఫీ కోసం కాకుండా సాధారణ ఫొటోలు, ప్రాథమిక వీడియో కాలింగ్ వంటి అవసరాలకు ఉపయోగపడే కెమెరాలుగా చెప్పుకోవచ్చు. హార్డ్‌వేర్ విషయానికి వస్తే.. ఇందులో 64MB ర్యామ్, 128MB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండనున్నాయి. స్టోరేజ్‌ను మైక్రోఎస్డీ కార్డు ద్వారా మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్లో హెచ్ఎండీ ఫీచర్ ఫోన్లలో ఉపయోగించే తేలికపాటి S30+ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించనున్నారు.
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
బ్యాటరీ విషయానికి వస్తే.. 1,450mah బ్యాటరీని ఇందులో అందించనున్నట్లు లీకులు చెబుతున్నాయి. ఫీచర్ ఫోన్‌కు తగిన తక్కువ పవర్ వినియోగం కారణంగా ఈ బ్యాటరీతో రోజువారీ వినియోగంలో ఎక్కువ కాలం బ్యాకప్ లభించే అవకాశం ఉంది. అయితే ఇంకా ఈ ఫోన్ ధర, అధికారిక లాంచ్ తేదీ, పూర్తి కనెక్టివిటీ వివరాలను హెచ్ఎండీ ఇంకా వెల్లడించలేదు. అయితే పేరు సూచిస్తున్నట్లుగానే 4జీ కనెక్టివిటీకి ఈ ఫోన్ ప్రాధాన్యతగా ఉండనుంది.
స్మార్ట్ఫోన్లకు బదులుగా కేవలం కాల్స్, మెసేజింగ్, ప్రాథమిక మల్టీమీడియా అవసరాల కోసం సరళమైన ఫోన్‌ను కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ మోడల్‌ను తీసుకురానున్నారు. కాంపాక్ట్ డిజైన్, 4జీ సపోర్ట్, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, సులభమైన ఆపరేటింగ్ సిస్టమ్ వంటి అంశాలు దీని ప్రధాన ఫీచర్స్. హెచ్ఎండీ అధికారికంగా మరిన్ని వివరాలను ప్రకటించిన తర్వాత నోకియా 125 4G 2nd Edition ధర, లభ్యత, పూర్తి ఫీచర్లపై స్పష్టత రానుంది.
తాజావార్తలు
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?