రాధేశ్యామ్ తో ప్రభాస్ అభిమానులను నిరాశపేర్చిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమా అని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన అభిమానులకు రాధేశ్యామ్ మిక్స్డ్ టాక్ ఆవేదనను మిగిల్చింది. ఇక దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ చూపు మొత్తం సలార్ పై పడింది. కెజిఎఫ్ తో రికార్డులు సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మళ్లీ అభిమానుల ఎదురుచూపులు మొదలయ్యాయి. అయితే ఈ సినిమాకోసం కూడా ఫ్యాన్స్ ఎదురుచూడక తప్పేలా లేదు. ఈ చిత్రం మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు కనీసం 60 శాతం షూటింగ్ కూడా పూర్తవలేదని ఇటీవల నిర్మాత తెలిపారు. దీంతో ఈ సినిమా ఈ ఏడాది నుంచి వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయ్యింది. అయితే అందుతున్న సమాచారం బట్టి ఈ సినిమా షూటింగ్ కు బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. దానికి కారణం కూడా ప్రభాస్ అనే టాక్ వినిపిస్తుంది.
రాధేశ్యామ్ సినిమా రిలీజ్ తరువాత ప్రభాస్ సర్జరీ కోసం విదేశాలకు వెళ్లాడని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ యూరప్‌లో మోకాలి సర్జరీ చేయించుకున్నాడని, రెండు నెలల వరకు కెమెరా ముందుకురావడం కష్టమట.. దీంతో సలార్ సినిమా షూటింగ్ ఆపడం తప్ప మేకర్స్ కి వేరే ఛాన్స్ లేదని, అందుకే రెండు నెలలు ఈ సినిమ షూటింగ్ వాయిదా పడినట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక షూటింగ్ ఈ రేంజ్ లో జరిగితే వచ్చే ఏడాది కూడా ఈ సినిమా కష్టమే అంటున్నారు టాలీవడ్ వర్గాలు. ఈ విషయం తెలియడంతో ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం కూడా మరో రెండేళ్లు ఎదురుచూడక తప్పదా..? అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సిందే..