Prabhas Salar Effect Release dates tobe changed: ముందు నుంచి అనుకున్నదే జరిగింది. సెప్టెంబర్ 28న రావాల్సిన “సలార్” డేట్ మారి క్రిస్మస్ కి రానున్నట్టు గత కొద్దిరోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. దాన్ని నిజం చేస్తూ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ఈ సినిమా క్రిస్మస్ కి రానుంది, డిసెంబర్ 22న విడుదల అవుతుంది అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ ప్రతి సినిమా విడుదలకు ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. ఆయన చేస్తున్న ప్రతి సినిమా అనేకసార్లు డేట్స్ మార్చుకుంటున్నట్టు కనిపిస్తూంది. ఈ సారి “సలార్”కి కూడా అలాగే జరిగి ఏకంగా రెండు నెలలు వాయిదా పడింది. సెప్టెంబర్ 28కి సినిమాని పూర్తి చేసి విడుదల చేయలేక నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ అప్పుడు సైలెంట్ అయి ఇప్పుడు ఇతర సినిమాల డేట్ మీద కన్నేసింది.
Prabhas: షారుఖ్ ఫామ్ లో ఉండొచ్చు… రెండు వేల కోట్లు కలెక్ట్ చేసి ఉండొచ్చు కానీ అక్కడ ఉన్నది ప్రభాస్
నిజానికి క్రిస్మస్ సెలవులను దృష్టిలో పెట్టుకొని నాని “హాయ్ నాన్న”, వెంకటేష్ “సైంధవ్”, నితిన్ “ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్”, సుధీర్ బాబు
“హరోం హర” సినిమాలు చాలా నెలల క్రితమే తమ డేట్స్ ప్రకటించుకుని ఆ మేరకు ప్రమోషన్స్ కూడా చేసుకుంటున్నాయి. ఈ నాలుగు చిత్రాలు కూడా డిసెంబర్ 22/23న వస్తున్నాం అని ప్రకటించి పబ్లిసిటీ కూడా మొదలు పెట్టగా సలార్ దెబ్బకి ఇప్పుడు ఆ సినిమాలన్నీ బరిలో నుంచి తప్పుకోవాలి, కొత్త డేట్స్ వెతుక్కోవాలి. “హాయ్ నాన్న” చిత్రం డిసెంబర్ లోనే రెండు వారాలు ముందుకు అంటే 7వ తేదీకి రాబోతున్నట్టు చెబుతున్నారు. ఇక మార్చే అవకాశం ఉంది. వెంకటేష్ “సైంధవ్”, నితిన్ “ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్”, సుధీర్ బాబు “హరోం హర” సినిమాలు ఏం చేయబోతున్నాయి అనేది చూడాలి.