సలార్ రిలీజ్ డేట్ అలా అనౌన్స్ చేశారో లేదో.. ప్రభాస్, షారుఖ్ ఖాన్ వార్ ఎలా ఉంటుందనే ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయింది. అసలు షారుఖ్‌తో ప్రభాస్ పోటీ పడడం ఏంటి? పైగా బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చాడు.. అనే మాట బాలీవుడ్‌లో వినిపిస్తోంది. అలాంటప్పుడు సలార్‌కు ఎందుకు భయపడుతున్నారనేది? ప్రభాస్ ఫ్యాన్స్ మాట కానీ సలార్‌కు ఏ ఖాన్ హీరో అయిన భయపడాల్సిందే. ఈ విషయం నార్త్ ఆడియెన్స్‌కు క్లియర్ కట్‌గా తెలుసు. ఎందుకంటే.. షారుఖ్ రెండు సినిమాలతో రెండు వేల కోట్లు ఇవ్వొచ్చు కానీ ప్రభాస్ ఒక్క బాహుబలి 2తోనే 1800 కోట్లు ఇచ్చాడు. బాహుబలి 1 కలుపుకుంటే.. 2500 కోట్ల వరకు ఉంటుంది. అది కూడా టికెట్ రేటు తక్కువగా ఉన్న రోజుల్లో.. ప్రభాస్ అంటే పెద్దగా తెలియని రోజుల్లో. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే ఏంటి.. ఫ్లాప్ టాక్‌తోనే వందల కోట్ల ఓపెనింగ్స్ అందుకున్నాడు ప్రభాస్.
సూపర్ హిట్ టాక్‌తో కనీసం ప్రభాస్ ఫస్ట్ డే రికార్డ్‌ను టచ్ చేయలేకపోయాడు షారుఖ్. అదే హిట్ టాక్ ప్రభాస్ సినిమాకు పడి ఉంటే… బాక్సాఫీస్ విధ్వంసం ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రభాస్ ఒక్కడే కాదు.. కేవలం మూడు సినిమాలతోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు ప్రశాంత్ నీల్. కెజియఫ్ చాప్టర్2తో ఏకంగా 1200 కోట్లకు పైగా రాబాట్టాడు. అయితే ఏంటి.. అక్కడుంది రాజ్ కుమార్ హిరాణీ అంటారా? కానీ అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. ఇప్పటి వరకు హిరాణీ చేసింది 5 సినిమాలు.. ప్రశాంత్ నీల్ చేసింది మూడు సినిమాలు మాత్రమే పైగా 2018లో KGF ఛాప్టర్ 1 సినిమాని షారుఖ్ ఖాన్ జీరో మూవీకి పోటీగా రిలీజ్ చేసి.. జెండా ఎగరేసాడు ప్రశాంత్ నీల్. ఈ దెబ్బకి షారుఖ్ ఖాన్ అయిదేళ్ల పాటు సినిమాలు చేయలేదు.
ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌తో కలిసి వస్తున్న ప్రశాంత్ నీల్ పై షారుఖ్ నెగ్గుతాడా? అంటే కష్టమనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రభాస్‌కు సౌత్‌లో తిరుగులేదు. నార్త్‌లో మంచి క్రేజ్ ఉంది. షారుఖ్‌కు సౌత్‌లో మార్కెట్ చాలా తక్కువ. ఒక్క నార్త్‌లోనే డంకికీ క్రేజ్ ఉంది. అలానే ఓవర్సీస్‌లో డంకీ, సలార్ వార్ నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి లెక్కలు చూసుకుంటే.. ప్రభాస్‌దే పై చేయి అనేలా ఉంది. అది కూడా హిట్ టాక్ పడితేనే. లేదంటే.. డంకి డామినేషన్ తప్పదు. ఏదేమైనా.. డిసెంబర్ 22న జరగబోయే వార్… ఇండియాలోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్‌గా చరిత్రలో నిలిచిపోనుంది.