“బాహుబలి” చిత్రం జపాన్ లో విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభాస్ లుక్స్, యాక్టింగ్ కు జపనీస్ యూత్ ఫిదా అయిపోయారు. ‘బాహుబలి’ నుంచి జపనీస్ ప్రేక్షకులలో ఒక వర్గం, అలాగే జపనీస్ మీడియా, ‘బాహుబలి’ స్టార్‌ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి ఇష్టపడతారు. ‘[బాహుబలి’ విడుదలై ఏళ్ళు గడుస్తున్నా అక్కడ ఇంకా ప్రభాస్ క్రేజ్ తగ్గనేలేదు. ఇప్పుడు కూడా ‘రాధే శ్యామ్’ సినిమా విడుదల సందర్భంగా ప్రభాస్ పై వారు తమ ప్రేమను ప్రదర్శిస్తున్నారు.
తాజాగా జపాన్‌కు చెందిన కూల్ డ్రింక్ బాటిల్స్ క్రేట్ చిత్రాలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఆ సీసాల లేబుల్స్ పై ప్రభాస్ పిక్ ఉండడం విశేషం. వాస్తవానికి అవి జపాన్ IKEAలో విక్రయించబడుతున్న ఖాళీ గాజు సీసాలు. వాటికి ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ట్రైలర్ లుక్ స్టిక్కర్ ఉండడం గమనార్హం. ఈ పనిని ప్రభాస్ నుండి అనుమతి తీసుకుని చేశారో లేదో తెలియదు. కానీ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో మాత్రం ఆ పిక్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.

అప్పట్లో జపనీస్ అభిమానులు ప్రభాస్ ‘బాహుబలి’ ఆర్ట్ మెటీరియల్స్ తో పాటు మిగతా వాటిని కూడా తయారు చేసేవారు. తరువాత వారు దానిని బాహుబలి టీమ్‌తో పంచుకునేవారు. అతి త్వరలో టీమ్ ‘రాధే శ్యామ్’ ప్రభాస్ జపనీస్ అభిమానుల నుండి ఇలాంటివి పొందే అవకాశం ఉందని నెటిజన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత జపాన్ లో ఇంత అభిమానాన్ని కూడగట్టుకుంది ప్రభాస్ అని చెప్పాలి.