రెబల్ స్టార్ గా ప్రభాస్ ని ఎంత మంది ఇష్టపడతారో, అంతకన్నా ఎక్కువ మంది ప్రభాస్ ని డార్లింగ్ గా ఇష్టపడతారు. ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలకి డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లోని ప్రభాస్ అంటే పిచ్చి. పాన్ ఇండియా స్టార్ అయిపోయాకా ప్రభాస్, ఆ రేంజ్ లవ్ స్టోరీ సినిమా చేయలేదు. రాధే శ్యామ్ సినిమా చేసినా అది ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్… ఓ ప్యూర్ లవ్ స్టోరీ చేయబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన లవ్ స్టోరీస్ సినిమాల్లో ది బెస్ట్‌గా నిలిచింది ‘సీతారామం’. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా.. హను రాఘవూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను వైజయంతి బ్యానర్ ప్రొడ్యూస్ చేసింది.
మణిరత్నం తర్వాత అంత అందంగా ప్రేమకథని చెప్పే దర్శకుడిగా హను రాఘవపూడి పేరు తెచ్చుకున్నాడు. సీతారామం రిలీజ్ ఏడాదిన్నర అవుతున్నా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు హను రాఘవపూడి. కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలన్నట్టు.. ప్రభాస్‌తో హను భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హను చెప్పిన కథకు ప్రభాస్ ఇంప్రెస్ అయినట్లు సమాచారం. ‘వరల్డ్ వార్ 2’ నేపథ్యంలో జరిగే కథని హను, ప్రభాస్ కోసం రాసాడని సమాచారం. యుద్ధంలో పుట్టే ప్రేమ కథ, యుద్ధ వీరుడి ప్రేమ కథ లాంటి ఎలిమెంట్స్ తో హను కథని సిద్ధం చేసే పనిలో ఉన్నాడని సమాచారం. ఈ డిసెంబర్ నుంచి హను రాఘవపూడి సినిమాకి ప్రభాస్ డేట్స్ కూడా కేటాయించాడని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. మరి ఈసారి హను రాఘవపూడి ఎలాంటి లవ్ స్టోరీతో వస్తాడో చూడాలి.