ప్రభాస్ ఏంటి? మారుతితో సినిమా చేయడం ఏంటి? అని మొదట్లో చాలా ఫీల్ అయ్యారు డార్లింగ్ ఫ్యాన్స్ కానీ ప్రభాస్ మాత్రం మారుతికి మాటిచ్చేశాడు. ఎవ్వరేమన్నా తన పని తాను చేసుకుంటు పోతున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ప్రభాస్.. అసలు అనౌన్స్మెంట్ లేకుండా ఓ సినిమా చేస్తున్నాడంటే… మారుతి పై ఎంత నమ్మకంతో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆ మధ్య లీక్ అయిన ప్రభాస్ ఆన్ సెట్ ఫోటో ఒకటి కలర్ ఫుల్‌గా ఉంది. ప్రభాస్‌ను ఇలాంటి లుక్‌లో చూసి చాలా రోజులైందని.. తెగ మురిసిపోయారు అభిమానులు. అప్పటినుంచే మారుతి సినిమా పై పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. మారుతి, ప్రభాస్ ఈ సినిమా అప్డేట్స్ ఇవ్వకపోయినా.. ఇండస్ట్రీ వర్గాల్లో అనఫీషియల్ అప్డేట్స్ బయటికి వస్తునే ఉన్నాయి.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం… ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు నలభై శాతం కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో అప్పుడే అంత షూటింగ్ చేశారా? అని షాక్ అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మారుతి సైలెంట్‌గా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. మళయాళ బ్యూటీ మాళవిక మోహనన్, రిద్ది కుమార్, నిధి అగర్వాల్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా సెట్ నుంచి మాళవిక మోహనన్ షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అయ్యింది. దీంతో ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంటుందని చెప్పొచ్చు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.