ప్రభాస్‌తో నటించే ఛాన్స్ అంటే ఎవ్వరు వదులుకుంటారు? అందులోను మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్‌కు ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోదు. అందుకే… ప్రభాస్ కోసం స్పెషల్‌గా కనిపించేందుకు రెడీ అవుతోందట అమ్మడు. అసలు ఇందులో నిజమెంతో తెలియదు గానీ… ప్రభాస్ సినిమాలో సీత అనే న్యూస్ వైరల్‌గా మారింది. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్‌గా నటిస్తుండగా… దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది.
Read Also: Eagle: ఈరోజు నిలబడితే ఈగల్ ని ఆపడం కష్టమే…
అమితాబ్ బచ్చన్, దిశా పటానీ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే… విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాని లాంటి హీరోలు కూడా కల్కిలో క్యామియో రోల్స్ చేస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది. ఇక ఇప్పుడు ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా స్పెషల్ క్యామియో చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ‘కల్కి’లో ఫిమేల్ క్యామియో కోసం మృణాల్‌ని అప్రోచ్ అవ్వగా.. అందుకు ఓకే చెప్పినట్లుగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ‘సీతారమం’ సినిమాని వైజయంతి మూవీస్ వారే నిర్మించారు పైగా ప్రభాస్‌తో ఛాన్స్ అనేసరికి మృణాల్ ‘కల్కి’లో స్పెషల్ క్యామియోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం కానీ ఇలాంటి వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాలంటే… సినిమా రిలీజ్ డేట్ మే 9 వరకు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా… కల్కి క్యామియో రోల్స్ మాత్రం సినిమా పై రోజు రోజుకి అంచనాలను పెంచేస్తోంది.