ఇప్పటి వరకు రెబల్ స్టార్ ‘ప్రభాస్’ సీక్వెల్ మూవీస్ మాత్రమే చేశారు. రెండు భాగాలుగా వచ్చిన ‘బాహుబలి’ భారీ విజయాన్ని సాధించగా.. నెక్స్ట్ కల్కి 2, సలార్ 2 రెడీ అవుతున్నాయి. ఈ లిస్ట్‌లో రాజాసాబ్ కూడా ఉంది. అయితే ఇవన్నీ సీక్వెల్స్ మాత్రమే. ఇప్పుడు ఓ సినిమాకు ప్రీక్వెల్ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ఫౌజీ’ కూడా ఒకటి. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కతున్న ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగష్టులో ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Also Read: Chikiri Chikiri Song: ‘చికిరి’ పాటకు టీడీపీ నాయకుడి స్టెప్పులు.. దర్శకుడు బుచ్చిబాబు రీట్వీట్!
అయితే ఫౌజీ చిత్రానికి ప్రీక్వెల్ చేసే ప్లానింగ్‌లో ఉన్నారట రాఘవపూడి. ఇప్పటి వరకు వచ్చిన ఫౌజీ అవుట్ పుట్ పట్ల ప్రభాస్ చాలా హ్యాపీగా ఉన్నారట. హను వర్క్‌కు ఫిదా అవుతున్నాడట డార్లింగ్. అందుకే ఆయనతో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఓ టాక్ ఉంది. ఇప్పుడు దాదాపుగా ప్రీక్వెల్ ఫిక్స్ అయినట్టేనని తెలుస్తోంది. అయితే ఫౌజీ రిజల్ట్‌ను బట్టి ఈ ప్రాజెక్ట్ ఉంటుందా?, ఉండదా? అనేది డిసైడ్ కానుంది. పౌజీ హిట్ అయితే ప్రీక్వెల్ ఉండే ఛాన్స్ ఉంది, లేదంటే లేదు. ఏదేమైనా ఫౌజీ మాత్రం మామూలుగా ఉండదనేది ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. యుద్ధంలో పుట్టిన ప్రేమకథగా ఈ సినిమా ఉంటుందని ముందు నుంచి ప్రచారంలో ఉంది. మరి ఈసారి హను ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.