‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి ఇటీవల ‘చికిరి’ అనే సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాట రిలీజ్ రోజు నుంచే డిజిటల్ మీడియాను కబ్జా చేసేసింది. రామ్ చరణ్ హుక్ స్టెప్, జాన్వీ కపూర్ గ్లామర్ పాటలో హైలెట్ కాగా.. రీల్స్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఎంతలా అంటే.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు ఈ పాటకు చిందులేస్తున్నారు. సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ కూడా చికిరి అంటూ స్టెప్పులేస్తున్నారు.
తాజాగా కడప జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు పంతగాని నరసింహ ప్రసాద్ కూడా చికిరి పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో.. పెద్ది దర్శకుడు బుచ్చిబాబు రీట్వీట్ చేయడం మరింత వైరల్‌గా మారింది. ప్రస్తుతానికైతే అందరూ చికిరి వైబ్‌లోనే ఉన్నారని చెప్పాలి. ఇప్పటికే ఈ పాట యూట్యూబ్‌లో అన్ని భాషల్లో కలిపి 90 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసి 100 మిలియన్స్ దిశగా దూసుకుపోతోంది. 1.5 మిలియన్ లైక్స్‌తో దుమ్ముదులిపేస్తోంది.
Also Read: Suryakumar Yadav Captain: షాకింగ్.. సూర్యకుమార్ యాదవ్‌కు నో కెప్టెన్సీ!
పెద్ది చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కానీ అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయిని అంటున్నారు. ఓ నెల అటు ఇటు అయినా.. వచ్చే సమ్మర్‌లో పెద్ది రావడం మాత్రం పక్కా. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి అభిమానులు, సెలబ్రిటీలు చేస్తున్న రీల్స్, డ్యాన్స్ వీడియోలతో చికిరి పాట సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది.
🤩🤍🙏🏻🧿 https://t.co/MJlAKa7uMC
— BuchiBabuSana (@BuchiBabuSana) November 21, 2025