Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళీ గురించి ఎవరికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా, రచయితగా, నిర్మాతగా, రాజకీయ నేతగా ఎన్నో పాత్రలు పోషించి మెప్పిస్తున్నాడు. ఇక ఎప్పటినుంచో పోసాని వైసీపీలో జగన్ కు సపోర్ట్ గా ఉన్న విషయం తెల్సిందే. సమయం వచ్చినప్పుడల్లా.. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను మెగా కుటుంబాన్ని విమర్శిస్తూ ఉంటాడు. గతంలో పోసాని, మెగా కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో అన్ని మాటలు అన్న పోసాని గత రెండు రోజుల నుంచి పవన్ పై ఎక్కడలేని ప్రేమను ఒలకపోయడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ మంచివాడని, అన్న చిరంజీవి కన్నా మంచివాడని.. చెప్పుకొచ్చాడు. దీంతో పోసాని.. సినిమా అవకాశాలు రాకపోయేసరికి పవన్ ను పొగిడితే అవకాశాలు వస్తాయని ఇలాంటి వేషాలు వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ ప్రశ్నకు పోసాని సమాధానం చెప్పుకొచ్చాడు.
Samajavaragamana Trailer: వాడి దృష్టిలో ఫ్యామిలీ మెంబర్స్ అంటే.. కెజిఎఫ్ లో బానిసలు
గతంలో మెగా కుటుంబంపై మీరు చేసిన విమర్శల వలన మీకు ఎఫెక్ట్ అయ్యిందా..? అన్న ప్రశ్నకు అవును.. ఎఫెక్ట్ అయ్యాను అని చెప్పిన పోసాని.. పవన్ కళ్యాణ్ నా కెరీర్ పోగొట్టాడు అని చెప్పడం పక్కనపెడితే.. ఆయన మంచివాడు అని ఒప్పుకున్నట్లు తెలిపాడు. ఇక 60 ఏళ్ళ వయస్సులో పాత్రలు ఎక్కడనుంచి వస్తాయని, పవన్ నా కెరీర్ ఆపేసినా .. తనకొచ్చిన నష్టమేం లేదని, తాను అవకాశాల కోసం పవన్ మంచివాడు అని ఒప్పుకోలేదని చెప్పుకొచ్చాడు. అసలు పవన్ మంచివాడు అని ఎందుకు ఇంత సడెన్ గా అనాల్సి వచ్చింది అన్న ప్రశ్నకు పోసాని మాట్లాడుతూ.. ” చంద్రబాబులో మంచితనం లేదు.. ఆయనతో పోల్చుకుంటే పవన్ మంచివాడు. చంద్రబాబు ను ఒకప్పుడు పొగిడి.. ఇప్పుడు ఎందుకు తిడుతున్నాను.అతడి బ్యాడ్ బిహేవియర్ వలన. ఇక పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అని నేనే పెట్టా.. అప్పుడు మంచివాడు. చాలా సిన్సియర్, ఆవేశపరుడు, కొంచెం ఆశయాలు ఉన్న మనిషి. ఇలా కోపంతో రగిలే పోయేవాడు.. ఇలా ఎందుకు మారావు. రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబుతో కలిసి దిగజారి మాట్లాడుతున్నావ్.. అనే ఉద్దేశ్యంతో నేను అన్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.