Samajavaragamana Trailer: యంగ్ హీరో శ్రీ విష్ణుకు గత కొన్నేళ్లుగా హిట్ పడింది లేదు. విభిన్నమైన కథలను ఎంచుకున్నా విష్ణుకు విజయం మాత్రం అందం లేదు. దీంతో ఈసారి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చాడు. ప్రస్తుతం శ్రీవిష్ణు సామజవరగమన అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమయ్యాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన బిగిల్ ఫేమ్ రెబ్బా మౌనిక జాన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. కథను మొత్తం రివీల్ చేయకుండా కేవలం వినోదాత్మకంగా సాగే సీన్స్, డైలాగ్స్ తో ట్రైలర్ ను నింపేశాడు డైరెక్టర్.
Arjun Sarja: కమెడియన్ కొడుకుతో స్టార్ హీరో కూతురు పెళ్లి..?
ఇక ఈ చిత్రంలో విష్ణు పిసినారి సంఘానికి అధ్యక్షుడులా కనిపించాడు. బాక్సాఫీస్ బాలు అనే పాత్రలో ఆద్యంతం నవ్వించాడు. అతడిని ప్రేమించిన ప్రతి అమ్మాయి చేత రాఖీ కట్టించుకుంటున్న బాలును హీరోయిన్ ప్రేమించి, డైరెక్ట్ గా ఇంటికి వచ్చి మకాం పెడుతుంది. ఆమెతో కూడా బాలు పనులు చేయిస్తూ ఉంటాడు. విష్ణు తండ్రిగా నరేష్ కామెడీ గురించి అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు బాలు దేనికి ఇలా మారాడు. ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటి అనేది సినిమాలోనే తెలుసుకోవాలి. ఇకపోతే ఈ సినిమా జూన్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోనైనా విష్ణు హిట్ ట్రాక్ అందుకుంటాడేమో చూడాలి.