Leo Naa Ready Song Promo Released: డైరెక్టర్ లోకేశ్ కనరాజ్ తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘లియో’. లోకేశ్ కనకరాజ్ యూనివర్స్ (LCU)లో భాగంగానే ఈ చిత్రం కూడా ఉండనుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ‘లియో’పై అంచనాలు భారీగా ఉన్నాయి. విజయ్ – లోకేశ్ కాంబినేషన్‍లో గతంలో రిలీజ్ అయిన మాస్టర్ మూవీ సూపర్ హిట్ అవడం విక్రం సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతున్నాయి. ఇక లియో సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ జూన్ 22న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించగా ఈరోజు నా రెడీ అంటూ సాగనున్న ఆ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. హీరో దళపతి విజయ్ పుట్టిన రోజు అంటే జూన్ 22న ఈ ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది.
Adipurush: ‘ఆదిపురుష్’లో తప్పేముంది?.. చిలుకూరి ఆలయ పూజారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘నా రెడీ’ అంటూ ఈ పాట ఉండనుందని ప్రోమోతో క్లారిటీ వచ్చేసింది. ఈ ఫస్ట్ సింగిల్ ప్రోమోలో చేతిలో గన్ పట్టుకొని.. నోట్లో సిగరెట్‍తో విజయ్ స్టైలిష్‍గా ఉన్నాడు. లియో మూవీలో గ్యాంగ్‍స్టర్‌గా నటిస్తున్న విజయ్ ఈ సాంగ్ స్వయంగా పాడడం గమనార్హం. ఇక లియో సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా వీరి గత కాంబినేషన్ దృష్ట్యా సినిమా పాటల మీద అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. లియో మూవీలో విజయ్ సరసన సీనియర్ హీరోయిన్ త్రిష నటించనుండగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో లియో మూవీ విడులయ్యే అవకాశం ఉండగా మరో బ్లాక్ బస్టర్ ఖాతం అని అందరూ భావిస్తున్నారు.