Pooja Hegde : స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే పరిస్థితి అధ్వానంగా తయారైంది. వరుసబెట్టి ప్లాపులతో సతమతం అవుతోంది. ఒకటీ, రెండు ప్లాపులు పడగానే చాలా మంది హీరోయిన్లకు అవకాశాలే రావు. కానీ పూజాహెగ్డేకు మాత్రం వరుసగా ప్లాపులు వస్తున్నా మొన్నటి దాకా ఛాన్సులు వచ్చాయి. కానీ ఇక మీదట రావడం కష్టమే అంటున్నారు ట్రేడ్ పండితులు. డస్కీ బ్యూటీగా ఫేమస్ అయిన ఈమె.. మొదట్లో ఇలాగే ప్లాపులు చవిచూసింది. ఆ తర్వాత కోలుకుని వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు ఖాతాలో వేసుకుంది. కానీ బ్యాడ్ లక్ మళ్లీ వెంటాడుతోంది. ఇప్పటికీ వరుసగా ఏడు ప్లాపులు వచ్చాయి. అన్నీ పెద్ద సినిమాలే. అయినా భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి.
Read Also : Manju Warrier : స్టార్ హీరోయిన్ నడుము గిల్లిన వ్యక్తి.. వీడియో వైరల్..
రీసెంట్ గా వచ్చిన సూర్య రెట్రో మీదనే ఆశలన్నీ పెట్టుకుంది. కానీ అది కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటికే టాలీవుడ్ ఆమెను పక్కన పెట్టేసింది. ఇప్పుడు కోలీవుడ్, బాలీవుడ్ కూడా ఆమెకు ఛాన్సులు ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. యంగ్ హీరోయిన్లు, హిట్ ఉన్న హీరోయిన్లకే జై కొడుతున్నారు స్టార్ హీరోలు, డైరెక్టర్లు. కాబట్టి ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా యుగంలో పూజా పరిస్థితి అధ్వానంగానే అనిపిస్తోంది. ఇన్ని ప్లాపుల నడుమ ఆమె అవకాశాలు దక్కించుకోవడం కష్టంగానే ఉంది. ఇప్పటికే ఒప్పుకున్న రెండు సినిమాల్లో కూడా ఆమెను తప్పించే ప్రయత్నంలో ఉన్నారంట. డిజాస్టర్ హీరోయిన్ గా ముద్ర పడటంతో పూజాకు అవకాశాలు దక్కట్లేదు.
Read Also : Saif Ali Khan: ఆదిపురుష్ చూపించి.. కొడుక్కి సారీ చెప్పిన సైఫ్